- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కొన్నాళ్ల కితం వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీ అంటేనే ఒక సంబరంలాంటిది. ప్రతి పెద్ద సినిమా విడుదలయ్యే సమయంలో ఎవరి సినిమా రికార్డులు బద్దలవుతాయో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుండేవారు. కానీ 2015లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ బాహుబలి ” ఆ రికార్డు గేమ్ మొత్తాన్నీ మార్చేసింది. ఆ సినిమా విడుదలైన తర్వాత “బాహుబలి రికార్డ్స్” అనేవి ఒక బెంచ్ మార్క్‌గా మారిపోయాయి. అప్పటి నుంచి స్టార్ హీరోల సినిమాలు “ నాన్ బాహుబలి రికార్డ్స్ ” సెట్ చేస్తున్నాయనే కొత్త కొలమానం మొదలైంది.


ఇక ఇప్పుడు అదే ట్రెండ్ రీ - రిలీజ్ మార్కెట్లో కూడా కనిపిస్తోంది. ఇటీవల “ బాహుబలి: ది ఎపిక్ ” పేరుతో రెండు భాగాలను కలిపి మళ్లీ విడుదల చేయగా, ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. తాజా లెక్కల ప్రకారం, ఈ రీ–రిలీజ్ వెర్షన్ ఒక్క రోజులోనే దాదాపు 20 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ సాధించినట్టు సమాచారం. ఇది రీ - రిలీజ్ కేటగిరీలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని స్థాయి ఓపెనింగ్‌గా నిలిచింది.


ఇండియన్ సినిమా చరిత్రలో లాంగ్ రన్ వసూళ్లలో బాహుబలి స్థాయిని ఏ సినిమా చేరుకోలేకపోయినా, రీ - రిలీజ్ మార్కెట్లో కూడా అదే రికార్డులు పున‌రావృతం అవుతున్నాయి. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల ప్రకారం, “ బాహుబలి ది ఎపిక్ ” కలెక్షన్లు మొత్తం రీ - రిలీజ్ సినిమాల వసూళ్లలో 90 శాతం పైగా షేర్ చేసుకున్నాయట. ఇది బాహుబలి ప్రభావం ఇప్పటికీ తగ్గలేదని రుజువు చేస్తోంది. ఇది ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే కాదు.. వ‌ర‌ల్డ్ సినిమా లోనే స‌రికొత్త రికార్డు అని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు బాక్సాఫీస్‌లో “  నాన్ బాహుబలి రికార్డ్స్  ” అనే కొత్త పరంపర రీ రిలీజ్ లలో కూడా ప్రారంభమైంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: