మాస్ మహారాజా రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో రవితేజ కు జోడిగా నటించింది. ఈ సినిమాకు బీమ్స్ సిసిరిలీయో సంగీతం అందించగా ... నవీన్ చంద్రమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. రాజేంద్ర ప్రసాద్ , హైపర్ ఆది , నరేష్మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాను నిన్న అనగా నవంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను మాత్రం అక్టోబర్ 31 వ తేదీన సాయంత్రం నుండే పెద్ద ఎత్తున ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

అలాగే ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారా పెద్ద మొత్తంలో కలెక్షన్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ప్రీమియర్ షో ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు దక్కాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు ప్రీమియర్ షో ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 5 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt