ఈ సినిమా ప్రస్తుతం ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో తయారవుతోంది. సినిమా యూనిట్ సమాచారం ప్రకారం, బాలయ్య కెరీర్‌లో ఇప్పటివరకు చూడని స్కేల్‌లో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఫైనల్ అయినట్లు సమాచారం.ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలని టీమ్ నిర్ణయించుకుంది.
ఇటీవల మూవీ మేకర్స్ ఈ చిత్రంలోని “మహారాణి” అనే కీలక పాత్రను పరిచయం చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ అప్డేట్‌పై అభిమానుల్లో ఆసక్తి తారస్థాయికి చేరింది. అసలు ఈ పోస్టర్ నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కావాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తు, రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కారణంగా ఆ అప్డేట్‌ను వాయిదా వేసినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 21 మంది మరణం పట్ల బాలయ్య సినిమా యూనిట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేసింది. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే బాలయ్య అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. అప్డేట్ వాయిదా పడినందుకు నిరాశ చెందినా, సినిమా టీమ్ తీసుకున్న ఈ మానవీయ నిర్ణయాన్ని వారు గౌరవించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి