- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించాడు ప్రశాంత్ వర్మ. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చి పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించారు. ఆ తర్వాత ప్రశాంత్ వ‌ర్మ నుంచి పది సినిమాల‌ కు సంబంధించి ప్రకటనలు వచ్చాయి. అందులో ప్రభాస్ - రిషబ్ శెట్టి లాంటి స్టార్ హీరోల ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే మధ్యలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమాకు సైతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని అందరూ అనుకున్నారు. సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా అనూహ్యంగా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఏ సినిమాలో డైరెక్ట్ చేస్తున్నారో ? ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. హనుమాన్ సూపర్ డూపర్ హిట్ అయ్యాక ప్రశాంత్ వర్మ టాలీవుడ్లో పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్నారని ... అయితే ఇప్పుడు అందరం నిర్మాతలు ఒకేసారి తమ సినిమాను ముందు సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని ప్రశాంత్ వ‌ర్మ పై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.


ప్రశాంత్ వర్మ స్టార్ హీరోలతో సినిమాలు తీస్తానని అడ్వాన్సులు తీసుకున్నారని ఇప్పుడు నిర్మాతలు అందరూ ఒకేసారి తమ ప్రాజెక్టులు ముందు టేకప్ చేయాలని ఒత్తిడి చేయడంతో ముందుగా ఎవరికి సినిమా చేయాలో తెలియని డైలమాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ప్ర‌శాంత్ వ‌ర్మ స్పందించారు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు. తాను ఈ వ్య‌వ‌హారంపై సంబంధించిన ప‌త్రాలు, ఈ మెయిల్స్ , ఒప్పందాల వివ‌రాల‌ను బ‌య‌ట‌కు చెపితే ... అది ఈ విచార‌ణ‌లో జోక్యం చేసుకున్న‌ట్టు అవుతుంద‌ని ... దీనిపై చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా విచార‌ణ జ‌రిపి .. నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని... ఇక సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌, మీడియా సంస్థ‌ల‌కు ఒక్క‌టే విజ్ఞ‌ప్తి అసంపూర్తి స‌మాచారం ప్ర‌చురించ‌వ‌ద్ద‌ని కోరుతున్న‌ట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: