- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. మహేష్ బాబు తెలుగులో తొలి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా గెలిచింది. ఒక్కడు 2003 సంక్రాంతి కానుకగా జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాతో పోటీగా రిలీజ్ అయిన ఒక్కడు సినిమా తొలి ఆటకే అదిరిపోయే టాక్‌ సొంతం చేసుకుంది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు ఈ సినిమాను నిర్మించారు. హైదరాబాదులో 7 కేంద్రాలలో వంద రోజులు పూర్తిచేసుకుంది. అయితే ఈ రికార్డును 2006లో వచ్చిన మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పోకిరి బ్రేక్ చేసింది. హైదరాబాద్ సినీ చరిత్రలో మొదటిసారిగా 17 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా పోకిరి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.


మహేష్ బాబు జోడిగా ఇలియానా హీరోయిన్గా నటించగా ... మణిశర్మ అందించిన పాటలు అదరగొట్టేసాయి. పూరి జగన్నాథ్ టేకింగ్ .. మహేష్ అండర్ కవర్ కాప్ గా చేసిన అద్భుతమైన నటన తెలుగు ప్రేక్షకులను తొలగించేసింది. చాలా సెంటర్లలో పోకిరి సినిమా 365 రోజులు పూర్తి చేసుకుంది. అంటే తెలుగు ప్రేక్షకులకు పోకిరి స్టైల్ కు ఎలా ఫిదా అయిపోయారో తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ కె ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో నటించిన వీరభద్ర సినిమా పోకిరి ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రిలీజ్ కి ముందు పోకిరి సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అంతకుముందు పూరి జగన్నాథ్ నాగార్జునతో తెర‌కెక్కించిన సూపర్ సినిమా కూడా ప్లాప్‌ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక వీరభద్ర అట్టర్ ప్లాప్ అవ్వగా... పోకిరి ఏకంగా ఏడాది పాటు ఆడింది. అలా హైదరాబాద్ సినీ చరిత్రలో తొలిసారి 17 కేంద్రాలలో సెంచరీ కొట్టిన సినిమాగా పోకిరి రికార్డులలో నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: