అయితే, సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఈ జంటను పాత కాలపు ప్రముఖ సినీ జంట సావిత్రి–జెమినీ గణేషన్‌తో పోలుస్తున్నారు. వారి మాటల్లో, “సావిత్రి–జెమినీ గణేషన్ జీవితంలో జరిగిన విధంగానే, విజయ్ దేవరకొండ–రష్మిక జీవితంలోనూ జరుగుతుందేమో” అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సావిత్రి పెళ్లి తర్వాత జెమినీ గణేషన్ కెరీర్ కొంత స్థిమితం కాగా, సావిత్రి మాత్రం అగ్రనటి స్థాయికి చేరుకుంది. ఆమె పేరు ఒక్కసారిగా ఇంటస్ట్రీని కవర్ చేసేసింది.ఇప్పుడు అదే పోలిక రష్మిక–విజయ్ జంటకు తీసుకొస్తున్నారు. ఎంగేజ్మెంట్ వార్త బయటకు వచ్చిన తర్వాత, విజయ్ దేవరకొండ పేరు కంటే రష్మిక పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఆమె ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. ప్రమోషన్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ — అన్నింటిలోనూ ఆమె అగ్రస్థానంలో ఉంది.
దీంతో కొందరు నెటిజన్లు “అచ్చం సావిత్రి–జెమినీ గణేషన్ జీవిత కథలాగే, విజయ్–రష్మిక జంట జీవితంలోనూ అలాంటి పరిస్థితులు రావొచ్చా?” అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే, “ఇద్దరూ విజయవంతమైన స్టార్‌లు, వారిద్దరి కెరీర్‌లు ఒకరిపై ఒకరు ప్రభావం చూపవు” అంటూ సమర్థిస్తున్నారు.ఏదేమైనా, రష్మిక–విజయ్ దేవరకొండ జంట ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలోనూ అత్యంత చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి ప్రేమ, నిశ్చితార్థం, కెరీర్ గ్రాఫ్ గురించి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్ని ఉత్కంఠకు గురి చేస్తోంది. ఈ ప్రేమకథ ఏ దిశలో సాగుతుందో చూడాలి కానీ, ప్రస్తుతం మాత్రం “విజయ్–రష్మిక” అంటే హాట్ టాపిక్ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి