మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ — ఈ పేరు వినగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం మొదలవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న తారక్, కేవలం నటనతోనే కాదు, తన కష్టపాటు, డెడికేషన్, డిసిప్లిన్‌తో కూడిన వ్యక్తిత్వంతో కూడా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడు. ఒకప్పుడు "స్టూడెంట్ నంబర్ 1", "సింహాద్రి" టైమ్‌లో కనిపించిన ఎన్టీఆర్ లుక్స్, ఇప్పుడు కనిపిస్తున్న తారక్ మధ్య ఉన్న తేడా చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఆయన తన శరీరాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రెజెంటేషన్‌ను ఎంతగా మలచుకున్నాడో చూస్తే నిజంగా గర్వపడాల్సిందే.


ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్స్‌పై అభిమానుల్లో ఒక కొత్త టెన్షన్ మొదలైంది. రీసెంట్‌గా బయటకు వచ్చిన కొన్ని పిక్స్‌లో తారక్ చాలా సన్నగా కనిపించడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. “ఎందుకింతగా స్లిమ్ అవుతున్నాడు?”, “ఇది సినిమా కోసం చేస్తున్న లుక్‌నా లేక మరేదైనా కారణమా?” అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కానీ వాస్తవానికి ఇది అంతా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కోసమేనని తెలిసినవాళ్లు మాత్రం శాంతంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ అంటేనే హై ఇంటెన్సిటీ, గ్రిట్టీ ప్రెజెంటేషన్, మాస్ అండ్ క్లాస్ లెవెల్ బాలెన్స్ కలిగిన దర్శకుడు. ఆయన సినిమాల్లో హీరో పాత్ర ఎలాంటి లుక్‌లో కనిపిస్తాడో, ఏ విధమైన యాటిట్యూడ్‌తో ఉంటాడో చివరి క్షణం వరకూ బయటికి లీక్ అయ్యే అవకాశమే ఉండదు. అదే కారణం వల్ల తారక్ అభిమానులు ఈసారి మాత్రం మరింత ఎగ్జైట్ అవుతున్నారు. తారక్ ఇంత కష్టపడి ఈ లుక్ మెంటెయిన్ చేస్తున్నారంటే సినిమాలో ఏదో బలమైన క్యారెక్టర్, ఇంటెన్స్ రోల్ ఉండబోతోందని గట్టి నమ్మకం ఏర్పడింది.



అయితే అభిమానులు చెబుతున్న ఒక మాట మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది —“తప్పదు నీల్ మావ... నువ్వు తారక్ లుక్స్‌పై ఉన్న ఈ టెన్షన్‌కు చెక్ పెట్టాలంటే, ఇప్పుడే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలి!” అని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం, ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఆన్‌స్క్రీన్‌లో ఎలా ఉండబోతుందో ఒక్కసారి అయినా చూపిస్తే చాలు, అందరి ఆందోళనలు ఒక్కసారిగా తగ్గిపోతాయి.  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ప్రాజెక్ట్‌పై అంచనాలు అద్భుతంగా ఉన్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి భారీ సినిమాల తర్వాత నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా కేవలం ఒక సినిమా కాదు, ఒక పాన్ ఇండియా ఫెనామినన్ అవ్వబోతోందనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: