హీరోయిన్ శోభన ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలు నటించి కొన్నేళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇటీవల ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కల్కి చిత్రంతో మొదలుపెట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన శోభన కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్నారిని దత్తకు తీసుకుందట. అయితే ఆడపిల్లను దత్తత తీసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన కూతురిని పెంచి తనకు ఎంతో ఇష్టమైన భరత నాట్యంను నేర్పించి, చెన్నై ప్రాంతంలో ఒక స్కూల్ కూడా నడుపుతోందట. అందులో ఎక్కువగా భరతనాట్యం నేర్పిస్తోందట శోభన.
శోభన సిని కెరియర్ విషయానికి వస్తే.. 1984లో మార్చండి మన చట్టాలు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సుమారుగా 30కు పైగా చిత్రాలలో నటించిన శోభన కు ఈ ఏడాది పద్మ భూషణ్ అవార్డును కూడా అందుకుంది. శోభన నాట్యంలో ,నటనలు కూడా ప్రసిద్ధి కాంచింది. అందుకే తాను నటించే చిత్రాలలో ఎక్కువగా అలాంటి పాత్రలలోని నటించడానికి ఇష్టపడేది శోభన. రీ ఎంట్రీలో ఎక్కువగా తల్లి పాత్రలోనే కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి