కొన్ని సంవత్సరాల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి , తమన్నా హీరోయిన్లుగా దగ్గుపాటి రానా విలన్ పాత్రలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ది బిగినింగ్ , బాహుబలి కంక్లూజన్ అనే సినిమాలు రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లకి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. బారి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ రెండు సినిమాలలోని కొన్ని సన్నివేశాలను కలిపి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో ఒక సినిమాను తాజాగా విడుదల చేశారు. బాహుబలి ది ఎపిక్ మూవీ కి ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఐదు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి బాహుబలి ది ఎపిక్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక ఏరియాలో 4.5 కోట్లు , తమిళ నాడు , కేరళలో కలుపు కొని 3.20 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకుని 6.95 కోట్లు , ఓవర్సీస్ లో 11.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఐదు రోజుల బాక్సా ఫీస్ అని కంప్లీట్ అయ్యే సరికి బాహుబలి ది ఎపిక్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇలా ఇప్పటివరకు బాహుబలి ది ఎపిక్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: