పాన్ ఇండియా హీరో ప్రభాస్ ,డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రం హర్రర్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్లో  ప్రభాస్ వింటేజ్ లుక్ లో చూపించిన తీరు అభిమానులను బాగా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల తేదీ ప్లాన్ చేశారు. గత రెండు మూడు రోజుల నుంచి రాజా సాబ్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తల వినిపించాయి. దీంతో డైరెక్టర్ మారుతితో పాటు, చిత్ర బృందం అలర్ట్ అయ్యి ఇక వరుసగా అప్డేట్ ఇచ్చేలా ప్లాన్ చేసినట్లు వినిపిస్తున్నాయి.


చిత్ర బృందం కూడా ఇటీవలే విడుదల తేదీ పోస్ట్ పోన్ పై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 25 ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని అలాగే అమెరికాలో కూడా చాలా గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ముందుగా రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఈనెల మూడో వారంలో ఈ సాంగ్ రిలీజ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ గిఫ్ట్ కింద మరొక ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి.


అందుకోసం డైరెక్టర్ మారుతి కూడా ఒక అదిరిపోయి ట్రైలర్ ని కట్  చేయబోతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమా పైన అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాల డైరెక్టర్ మారుతి ప్లాన్ చేశారట. అలాగే యూఎస్ఏ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని క్రిస్మస్ కానుకగా ప్లాన్ చేసి జనవరి మొదటి వారంలో భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ మారుతి. అలా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాజా సాబ్ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు నెల రోజుల నుంచి భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను చేసేలా చూసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: