ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే కనిపించలేదు. కనీసం హీరో హీరోయిన్స్ కి సంబంధించి ఎలాంటి లుక్స్ కూడా బయటికి రాలేదు. సినిమా విడుదలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేపట్టలేదు చిత్ర బృందం. అసలు ఈ సినిమా ఏడాది రిలీజ్ అవుతుందా? అనే విషయంపై ఇప్పుడు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో సాయి పల్లవి తనని తాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యింది.
అలాగే భారీ బడ్జెట్ మూవీ రామాయణ రెండు భాగాలలో తెరకెక్కిస్తూ ఉండగా అందులో సీత పాత్రలో కనిపించబోతోంది. ఇందులో రాముడు గెటప్ లో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. మరి సాయి పల్లవి సీత పాత్రలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. మేరీ రహో సినిమాలో సాయి పల్లవి బాలీవుడ్ కెరియర్ కి ప్లస్ అవుతుందో చూడాలి. చివరిగా సాయి పల్లవి తెలుగులో నాగచైతన్య నటించిన తండేల్ చిత్రంలో నటించింది. ఆ తరువాత తెలుగులో మళ్లీ ఎటువంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ప్రస్తుతం సాయి పల్లవి ఫోకస్ మొత్తం రామాయణ సినిమాలోని సీత పాత్ర మీదే ఉందని అందుకే తదుపరి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి