వీడియోలో స్పష్టంగా మిస్సింగ్‌గా ఉన్న అంశాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి:
*హీరోయిన్ ప్రియాంక చోప్రా కనిపించలేదు.
*విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ కుమార్ కు సంబంధించిన ఒక్క షాట్ కూడా లేదు.
*మహేష్ బాబు లుక్ స్టైలిష్‌గా ఉన్నా… ఆయన నుంచి ఒక్క డైలాగ్ కూడా రాలేదు.
*మొత్తం వీడియో ఇంట్రడక్షన్ షాట్స్, సెట్టింగ్స్, ఎన్విరాన్‌మెంట్ బిల్డప్ లా అనిపించింది కానీ అసలు సినిమా సారాంశాన్ని చూపలేదు.
ఇవన్నీ చూసిన ప్రేక్షకుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రాజమౌళి మైండ్‌లో ఉన్న వీడియో ఇదేనా? లేకపోతే లాస్ట్ మినిట్‌లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల వేరే ఒక గ్లింప్స్ వీడియో ఎడిట్ చేసి రిలీజ్ అయ్యిందా? అని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.
కొంతమంది నెటిజన్లు అయితే మరింత సీరియస్‌గా కామెంట్ చేస్తున్నారు— “రాజమౌళి చీట్ చేశాడు. అసలు చూపించాల్సిన వీడియో వేరేది. ఇది ఏదో అడ్జస్ట్ చేసి ఇచ్చిన గ్లింప్స్ మాత్రమే!”. ఈ కామెంట్లు ఒకేసారి విపరీతంగా వైరల్ అవుతుండటంతో, సినీ ప్రముఖులు స్పందిస్తూ: “ఇలాంటి రూమర్స్ తగ్గాలంటే వారణాసి మూవీ టీం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలి” అంటున్నారు. ఇక రాజమౌళి సినిమాలంటే ప్రజలకు ఉన్న భారీ ఎక్స్‌పెక్టేషన్ దృష్ట్యా, చిన్న తప్పిదం, చిన్న గ్యాప్ కూడా పెద్ద చర్చగా మారటం సహజం. కానీ ఈసారి ప్రేక్షకుల నిరాశ మాత్రం ఆశ్చర్యకరంగా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే రాజమౌళి నిజంగా ఏదైనా లాస్ట్ మినిట్ మార్పు చేశారా? లేక ఇది ఆయన ప్లానింగ్‌లో భాగమా? అన్నదాని పై క్లారిటీ వస్తేనే పలువురి డౌట్లు క్లియర్ అవుతాయి. ఇక వారణాసి టీం స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి