ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, 2027 సమ్మర్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నవంబర్ 15న హైదరాబాద్‌లో జరిగిన మెగా ఈవెంట్‌లో చిత్రబృందం మూవీ టైటిల్ గ్లింప్స్‌ను ఆవిష్కరించగా, ఆ ఒక్క నిమిషం వీడియో మొత్తం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చగా మారింది. గ్లింప్స్‌లో మహేష్ బాబు శ్రీరాముడి శక్తిని స్ఫురింపజేస్తూ కనిపించినట్లు రాజమౌళి స్వయంగా ప్రకటించగా, వీడియోలో అతి శక్తివంతమైన రూపంలో కనిపించిన ఒక దేవతా చాయా ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించింది.


ఆమె ఎవరు? ఎందుకు తన తలను తానే నరుక్కుంది? ఆమె రక్తాన్ని ఎందుకు మూడు దిశల్లో ప్రవహింపజేస్తుంది? ఈ ప్రశ్నలు ప్రస్తుతం దేశమంతటా ట్రెండ్ అవుతున్నాయి. ఛిన్నమస్తాదేవి — దశమహావిద్యల్లో అత్యంత రహస్యమైన శక్తిరూపం . గ్లింప్స్‌లో చూపబడిన ఆ దేవత దశ మహావిద్యల్లో ఒకటైన ‘ఛిన్నమస్తాదేవి’. ఆమెను వజ్రవైరోచనీ, ప్రచండ చండీ అనే పేర్లతో కూడా పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చింతపుర్ణీ దేవీ ఆలయంలో ఈ అమ్మవారిని అత్యంత భక్తితో ఆరాధిస్తారు. నరసింహ అవతారం, పరశురామ అవతారాల రౌద్ర శక్తికి సమానమైన ఆగ్రహం, శక్తి, విరక్తి ఈ అమృతరూపిణి వద్ద ఉన్నాయని తాంత్రిక గ్రంథాలు ప్రకటిస్తాయి.



ఈ దేవత భౌతిక వాంఛలపై విజయం సాధించిన శక్తికి ప్రతీక. ఆమె కాళ్ల కింద మన్మథుడు, రతీదేవి శృంగార విలాసంలో కనిపించడం వెనుక గాఢమైన సంకేతార్థం ఉంది— కామాన్ని జయించగలిగిన పవిత్ర శక్తి మాత్రమే మాయ, మోహాలకు అధిపతి అవుతుంది. ఛిన్నమస్తాదేవి శిరస్సును తానే ఖండించుకుని, బయలుదేరే మూడు రక్తధారలను తాను — అలాగే తనతో ఉన్న డాకినీ, వారణీ దేవతలకు పంచుతుంది. ఈ మూడు రక్తప్రవాహాలు ఇడా, పింగళ, సుషుమ్న నాడులను సూచిస్తాయి. యోగ తత్వంలో ఇవే జీవశక్తి ప్రవాహాన్ని నియంత్రించే ప్రధాన శక్తిస్రోతసులు.



ఒక రోజు పార్వతీ దేవి తన సహచరులైన డాకినీ, వారణీలతో కలిసి స్నానం కోసం నదికి వెళ్తుంది. స్నానానంతరం ఆమెలో ఆకలి, కామవాంఛలు తీవ్రమవుతాయి. దేహబలహీనత, ఇంద్రియవాంఛలను ఎలా జయించాలి? — అన్న భావనలో ఆమె అసాధారణ నిర్ణయం తీసుకుంటుంది. భౌతిక వాంఛలను పూర్తిగా అణచివేయడానికి ఆమె తన శిరస్సును తానే నరుక్కుంటుంది. ఆమె రుధిరధార నుంచి ప్రవహించే శక్తిని తానే అనుభవిస్తూ, తనతోనున్న దేవతలకు కూడా పంచుతుంది. ఈ రూపం ద్వారా దేవీ మనిషికి తెలిపే శక్తి సందేశం స్పష్టంగా ఉంటుంది— “శరీర వాంఛలను జయించింది అంటేనే నిజమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది.”..ఎందుకు తంత్రికులు, సాధకులు ఛిన్నమస్తాను ఆరాధిస్తారు? ఈ రూపాన్ని కొలవడం సాధారణ భక్తుడికి కాదు. భక్తితో పాటు భయాన్ని జయించే ధైర్యం, ఆత్మసాధనలో ఆవేశాన్ని నియంత్రించే శక్తి కావాలి.డాకినీ నల్లవర్ణంలో కాళికా స్వరూపాన్ని సూచిస్తే, వారణీ ఎరుపులో శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. ఈ ఇద్దరూ కాలం మరియు శక్తుల సమన్వయాన్ని ప్రతిబింబిస్తారు.



‘వారణాసి’ కథలో ఛిన్నమస్తాదేవి పాత్ర?

గ్లింప్స్‌ను బట్టి చూస్తే— తేత్రాయుగంలో రాముడి చేతిలో ఓడిపోయి చేతులు, కాళ్లు కోల్పోయిన కుంభకర్ణుడు, కలియుగంలో ‘కుంభ’ అనే వికలాంగుడిగా పుడతాడు. గతజన్మ శక్తిని తిరిగి పొందాలనే తపనతో ఛిన్నమస్తాదేవిని పూజిస్తాడు.ఈ భావన సినిమాకు ఒక మిస్టిక్, ఆధ్యాత్మిక, విజువల్ గ్రాండియర్ కలిగిన పునాది అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: