మాస్ మహారాజా రవితేజ ఇటీవలి కాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం మాస్ జాతర ఆశించిన స్థాయిలో నిలువలేకపోయింది. అభిమానులు భారీగా ఎదురు చూసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. రవితేజ అంటే మాస్ ఎనర్జీ, పంచ్ డైలాగులు, వేగవంతమైన కథనం—అన్ని ఢీ కొట్టే వినోదం అనేది ప్రేక్షకుల అంచన. కానీ ఈ సినిమాతో ఆ మంత్రం పూర్తిగా పనిచేయలేదనే అనిపించింది.అయినా కూడా, రవితేజ మాత్రం ఎప్పటిలాగే తన స్పీడ్ తగ్గించకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి పై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు.  ఎందుకంటే ఇందులో రవితేజ పూర్తిగా కొత్త షేడ్స్‌తో కనిపించబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రవితేజ ప్రత్యేక ఎనర్జీ మిక్స్ కావడంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇక తాజాగా టాలీవుడ్ సర్కిళ్లలో మరో హాట్ టాపిక్ రచ్చ రచ్చ చేస్తోంది. అది రవితేజ తదుపరి సినిమాపై వినిపిస్తున్న వార్త. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రవితేజ నటించేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారని పరిశ్రమలో బలమైన టాక్. సాధారణంగా శివ నిర్వాణ అంటే ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్, హార్ట్-టచింగ్ ప్రేమ కథలు గుర్తుకొస్తాయి. కానీ ఈసారి ఆయన పూర్తిగా విభిన్నమైన జానర్ అయిన క్రైమ్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టబోతున్నారట. ఆయన స్టైల్‌లో రవితేజ మాస్ అటిట్యూడ్ కలిస్తే స్క్రీన్‌పై ఏమి జరుగుతుందో అనేది ఇప్పుడే ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది.



అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ సమంతను తీసుకోవాలని టీమ్ ఆలోచిస్తున్నారట. ఇదే టాలీవుడ్‌లో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. రవితేజ–సమంత కాంబినేషన్ ఇప్పటివరకు కనిపించకపోవడం వల్ల ఈ జంట స్క్రీన్‌పై ఎలా కనిపిస్తారో అన్న కుతూహలం మరింత పెరిగింది. సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మా ఇంటి బంగారం చిత్ర నిర్మాన పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాతో ఆమె మళ్లీ ఎమోషనల్ ఫ్యామిలీ సబ్జెక్ట్‌లోకి అడుగు పెడుతోంది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ క్యారెక్టర్లలో చూపే ఇంటెన్సిటీ  తెలుసు కదా—అలా ఆమె రవితేజ సరసన ఒక థ్రిల్లర్ లో నటిస్తే సినిమా రేంజ్ ఎక్కడికి ఎగురుతుందో ఇప్పుడే చెప్పలేం.ఇక రవితేజ–సమంత కాంబినేషన్ నిజంగానే ఫైనల్ అయితే ఇది టాలీవుడ్ లో ఓ రేర్ & పవర్‌ఫుల్ జంటగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రవితేజ ఎనర్జీకి సమంత ఎమోషనల్ డెప్త్ యాడ్ అయితే కథకు ఓ ప్రత్యేకమైన బలాన్ని ఇస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా సమంత హీరో నాగ చైతన్య ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆతరువాత కొన్ని కారణాల చేత డివర్స్ తీసుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: