రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అది సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. అయితే ఈ టైటిల్‌పై ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. చాలాకాలం గ్యాప్ తర్వాత మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు సుబ్బా రెడ్డి దీనికి కారణం. సాయి కుమార్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో వచ్చిన ‘రఫ్’ సినిమాను డైరెక్ట్ చేసిన ఆయన, ప్రస్తుతం తెరకెక్కిస్తున్న తన తాజా చిత్రానికి కూడా ‘వారణాసి’ అనే టైటిల్‌ను నిర్ణయించారు.


కొద్ది రోజుల క్రితం ఈ చిన్న చిత్రానికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ విడుదల చేసింది. అయితే ఇదే టైటిల్‌ను పెద్ద స్ధాయిలో రాజమౌళి–మహేష్ బాబు సినిమా కోసం కూడా వినియోగించడం ప్రారంభించడంతో, రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ నిర్మాతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమది చిన్న సినిమా అయినా, ‘వారణాసి’ టైటిల్‌ను చాలా ముందే ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నామని, దానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలను కూడా కలిగి ఉన్నామని వారు తెలిపారు.దీనిపై దర్శకుడు రాజమౌళి మరియు దుర్గా ఆర్ట్స్ పై నిర్మాత విజయ్ కే ఫిర్యాదు చేస్తూ, తమ అనుమతి లేకుండా ఇప్పటికే రిజిస్టర్ చేసిన టైటిల్‌ను పెద్ద సినిమా కోసం వినియోగించడం అన్యాయం అని ఆరోపించారు. ఫిల్మ్ చాంబర్ నుంచి తమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన లేఖల్ని కూడా బయటకు విడుదల చేశారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.



ఇక మరోవైపు, రాజమౌళి విడుదల చేసిన ‘వారణాసి’ టైటిల్ ఈవెంట్‌లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రీయ వానరసేన సంఘం రాజమౌళిపై అధికారిక ఫిర్యాదు చేసింది. దీంతో వరుస సమస్యలతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ వివాదాలు కమ్ముకుంటూ, రాజమౌళి అనుకోని చిక్కుల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంతమంది మాత్రం ఇది ఏ సినిమా కి అయినా కామన్..ఇక పెద్ద సినిమాల విషయంలో ఇలాంటివి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. లాస్ట్ అన్ని సర్ధుమణిగిపోతాయ్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: