టాలీవుడ్‌లో వరుస హిట్‌ చిత్రాలను అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతుడు నాగ్ అశ్విన్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ఒకటైన ‘కల్కి 2’ సీక్వెల్‌ కోసం సన్నాహాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.  ‘కల్కి ’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన, ఇక రెండో భాగంతో పాన్‌-ఇండియా ప్రేక్షకుల ముందుకు మరొక భారీ విజన్‌ను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ త్వరలో భారతీయ సినీ పరిశ్రమలో లెజెండరీ పేరు అయిన సింగీతం శ్రీనివాసరావుతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.


గతంలో ఎన్నో క్లాసికల్ మూవీస్ ని నిర్మించి, తన సొంత శైలితో సినీప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దిగ్గజ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేయబోతున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ కామెడీ డ్రామాను అనుదీప్ కెవి దర్శకత్వంలో నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని రుచి చూసిన నాగ్ అశ్విన్, ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావుతో కలిసి ఒక భిన్నమైన ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఏ జానర్‌లో ఉంటుందో, ఇందులో ఏ టచ్ మసాలా ఉంటుందో, ఇప్పటి తరానికి సింగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంతో ఏ విధమైన కొత్త కథను అందించబోతున్నారో అన్నది ఇప్పుడు సినీప్రియులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.



భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలకు, నవీనతకు నిలువెత్తు నిదర్శనం అయిన సింగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వం గా రి రీ-ఎంట్రీ వంటి ఈ ప్రాజెక్ట్, నాగ్ అశ్విన్ ప్రొడక్షన్ వల్ల మరింత గ్రాండ్‌గా రూపుదిద్దుకోనుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ లెజెండరీ కాంబినేషన్‌పై ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా చర్చ ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ నిర్మించబోతున్న ఈ ప్రత్యేక చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: