తెలుగు , తమిళ్ ఇండస్ట్రీ లలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న అతి కొద్ది ముద్దుగుమ్మలలో త్రిష , నయనతార ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ నటీ మణులుగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇకపోతే వీరిద్దరూ కూడా మొదట తమిళ సినిమాల ద్వారా కెరియర్ను ప్రారంభించారు. తమిళ ఇండస్ట్రీ లో నటి మనులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఇచ్చారు. ఇక వీరిద్దరికి తెలుగు సినిమా పరిశ్రమలో కూడా చాలా తక్కువ సమయం లోనే మంచి విజయాలు , మంచి గుర్తింపు దక్కాయి. దానితో వీరు తెలుగు సినీ పరిశ్రమలో కూడా స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ముద్దు గుమ్మలు అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీ లలో వరుస సినిమాలలో నటిస్తూ అద్భుతమైన రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తూ కుర్ర హీరోయిన్లకు సైతం పోటీని ఇస్తున్నారు.

గత కొంత కాలం పాటు వీరిద్దరూ కేవలం తమిళ సినీ పరిశ్రమ పై ఫుల్ ఫోకస్ పెట్టి తెలుగు సినిమాల్లో నటించలేదు. కానీ ప్రస్తుతం వీరిద్దరూ అటు తమిళ్ ఇటు తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక నయనతార విషయానికి వస్తే చిరంజీవి హీరో గా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరికొన్ని రోజుల్లోనే బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో స్టార్ట్ కాబోయే సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా కన్ఫామ్ అయ్యింది. ఈ విషయాన్ని మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో త్రిష తో పోలిస్తే నయన తార చేతిలో ఒక సినిమా అదనంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: