- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగానే డబుల్ ధమాకా దక్కింది. ఎన్నాళ్లుగానో వాయిదాలు పడుతూ వచ్చిన హరిహర వీరమల్లు ఒక వైపు, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన OG మరో వైపు ప్రేక్షకులను చేరుకొని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా OG భారీ కమర్షియల్ హిట్ కావడంతో పాటు పవర్‌స్టార్ మార్క్ మాస్ ఎనర్జీని తిరిగి గుర్తు చేసింది. దీంతో పవన్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్‌గా కొనసాగాలనే డిమాండ్ అభిమానుల్లో కూడా, నిర్మాతలలో కూడా పెరిగింది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ముందుకు సాగుతుండగా, 2029 ఎన్నికలకు ముందు పవన్ మరో రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న టాక్ బలంగా మారుతోంది.


అయితే ఇప్పుడు పవన్‌తో సినిమా చేయడం అంటే నిర్మాతలకు ఇది ఒక పెద్ద సవాలు. రామ్ తళ్లూరి, టీజీ విశ్వప్రసాద్ వంటి నిర్మాతలు గత రెండేళ్లుగా అడ్వాన్స్‌లు ఇచ్చి పవన్ డేట్స్ కోసం ఓపికగా ఎదురు చూస్తున్నారు. పవన్ బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్‌లు వాయిదా పడుతున్నా, అడ్వాన్స్‌లు వెనక్కి తీసుకోవాలనే ఆలోచన వారికి లేదు. ‘‘ఎప్పుడు కుదిరితే అప్పుడే సినిమా చేద్దాం’’ అన్న నమ్మకంతోనే వారు పవన్‌కు అడ్వాన్స్‌లు ఇచ్చారు. పవన్ కూడా మాట ఇచ్చినందున ఆ కమిట్‌మెంట్‌లను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు.


అస‌లు సమస్య ఏమిటంటే ఇప్పుడు పవన్ కేవలం హీరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా. ఆయన షెడ్యూల్ పూర్తిగా అనిశ్చితంగా ఉంటుంది. ఏ రోజు షూటింగ్‌కు రావచ్చు, ఏ రోజు ప్రజాసభల్లో పాల్గొనాలని అనుకోవచ్చు, అన్నది ఆయనే చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో పవన్‌తో సినిమా పూర్తి చేయాలి అంటే కేవలం డైరెక్టర్ సరిపోడు.. స‌రైన ప్లానింగ్‌, ఖచ్చితమైన టైమ్ మేనేజ్‌మెంట్‌తో ముందుకు వెళ్లగల దర్శకుడే అవసరం. పవన్ సెట్‌కి వచ్చినంత మాత్రాన మిగతా నటీనటులు, బృందం అందరూ అప్పటికే సిద్ధంగా ఉండాలి. పవన్ లేని సమయంలో ఇతర సీన్స్‌ను పూర్తి చేసి, ఆయన వచ్చిన ఆ కొద్ది గంటల్లోనే పవన్ సీన్స్‌ను పక్కా ప్లానింగ్‌తో తీసేయడం దర్శకుడు-ప్రొడక్షన్ టీమ్‌ తప్పనిసరి.


ఈ మైక్రో మేనేజ్‌మెంట్ చేయగల దర్శకుడి కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా వెతుకుతున్నట్లు సమాచారం. కథ మంచి ఉండటం ఒక విషయం, కానీ నెమ్మదిగా పని చేసే డైరెక్టర్ అయితే ఇప్పుడు పవన్‌కు అస్సలు సెట్ అవ్వరు. గతంలో సముద్రఖని వంటి దర్శకులు తక్కువ సమయంలో రీమేక్ ప్రాజెక్టులు పూర్తి చేసి పవన్‌కు మంచి కంఫ‌ర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్ద‌రు ద‌ర్శ‌కుల పేర్లు ప‌వ‌న్ కొత్త సినిమాల కోసం చ‌ర్చ‌ల్లో ఉన్న‌ట్టు టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: