ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వైరల్ అవుతున్న విషయం రాహుల్ పెళ్లి తర్వాత షేర్ చేసిన కొత్త ఫోటోలు. తాజాగా రాహుల్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని రొమాంటిక్ హనీమూన్ ఫొటోలను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు “హనీమూన్ గోల్స్”, “బెస్ట్ లవ్ స్టోరీ”, “నీ లైఫ్‌లోకి మంగమ్మ వచ్చేసింది బ్రో” అంటూ కామెంట్లు చేయడం ప్రారంభించారు. మరికొందరు అయితే మరీ హద్దులు మీరి ఎక్స్‌ట్రీమ్ రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ విపరీతంగా ఆకర్షణ కలిగిస్తున్నారు.ప్రస్తుతం ఈ నూతన దంపతులు మాల్దీవ్స్ అందాలను ఆస్వాదిస్తూ, అక్కడి బీచ్‌లు, సూర్యోదయం, సూర్యాస్తమయ సోయగాలు, ప్రకృతి అందాలు అన్నింటి మధ్య హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రాహుల్ షేర్ చేసిన ప్రతి ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్ల దృష్టి మొత్తం ఈ జంటపైనే నిలిచిపోయింది.
కొత్త జీవితాన్ని ఆరంభించిన రాహుల్–హరిణ్య జంటకు అభిమానులు, మ్యూజిక్ లవర్స్, బిగ్‌బాస్ ఫాలోవర్స్ నుంచి బెస్ట్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే రాహుల్ హనీమూన్ పిక్స్‌పై వస్తున్న ఫన్నీ కామెంట్స్ చూసి నెటిజన్లు కూడా ఎంజాయ్ అవుతూ, కొత్తగా పెళ్లయిన ఈ జంట ట్రోల్స్-టాప్‌లిస్టులో నిలుస్తోంది.మొత్తం మీద రాహుల్ హనీమూన్ పోస్టులు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి