కొంతమంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేస్తే కొన్ని చిన్న చిన్న తప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియోనే నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు అబ్బా ప్రభాస్ అన్న పరువు మొత్తం పాయె.. ప్రభాస్ అన్న కి సంబంధించిన ఈ వీడియో చూస్తే అభిమానులు కూడా తల దించుకుంటారు. మరీ ఇంత ఘోరమా అంటూ చాలామంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ ప్రభాస్ కు సంబంధించిన ఆ వీడియో ఏంటి..ఎందుకు ప్రభాస్ పరువు పోయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.ప్రభాస్ నటించిన బాహుబలి మూవీ జపాన్ లో విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

సినిమా జపాన్ లో విడుదల కాబోతున్న  నేపథ్యంలోనే తాజాగా జపాన్ లో డిసెంబర్ 12 న విడుదల కాబోతున్న బాహుబలి పోస్టర్ పై ప్రభాస్ వి లవ్ అని రాయబోయారు. అయితే లవ్ అనే పదం లో love అని స్పెల్లింగ్ ఉంటుంది. కానీ ప్రభాస్ మాత్రం తడబడిపోయి loe అని రాసి మళ్ళీ e లెటర్ ని v గా మార్చేసి లవ్ అని స్పెల్లింగ్ రాశారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ లవ్ స్పెల్లింగ్ రాక తడబడి రాసిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఇదేంటి అసలు ప్రభాస్ కి love అని లవ్ స్పెల్లింగ్ కూడా రాదా ? కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకునే ప్రభాస్ ఇంగ్లీష్ రాయడంలో మరీ అంత వీకా? 
అయ్య బాబోయ్ ఇలాంటి దారుణం మేం ఎప్పుడో చూడలేదు. ఇదేందయ్యా ఇది మేమెప్పుడూ చూడలే అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మందేమో మా ప్రభాస్ అన్న ఇప్పటివరకు లవ్ లో పడలేదు. అందుకే ప్రభాస్ అన్న కి లవ్ స్పెల్లింగ్ కూడా రావడం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రభాస్ లవ్ స్పెల్లింగ్ రాయలేక తడబడ్డ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక చిన్న స్పెల్లింగ్ రాయలేక ప్రభాస్ పరువు పోగొట్టుకున్నారు అంటూ ఈ వీడియోకి కామెంట్ల మోత మోగిపోతుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: