నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 మూవీ అనుకోకుండా వాయిదా పడడంతో చాలామంది అభిమానులు నిరాశ పడ్డారు. ముఖ్యంగా అప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న అభిమానులందరూ కూడా నిర్మాతలపై మండిపడడంతో పాటు తెగ డిసప్పాయింట్ అయిపోయారు. దాంతో అఖండ-2 వాయిదా సెగ ఇప్పటికీ చల్లారడం లేదు. అయితే మొదట టెక్నికల్ ఇష్యూ వల్ల సినిమా విడుదల కాలేదని అందరూ అనుకున్నారు. కానీ దాని తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. అదేంటంటే అఖండ-2 సినిమా నిర్మించిన 14 రీల్స్ బ్యానర్ కి ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ కి మధ్య చాలా రోజుల నుండి ఆర్థిక లావాదేవీల ఇష్యూ నడుస్తుందట. 

గతంలో నిర్మించిన సినిమాల విషయంలో వచ్చిన నష్టాలను 14 రీల్స్ బ్యానర్ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదట. అలా దాదాపు 28 కోట్ల డబ్బు ఇవ్వాల్సి ఉందట.అయితే ఆ డబ్బు ఇప్పటివరకు చెల్లించకపోవడంతో అఖండ-2 ని ఈరోస్ ఇంటర్నేషనల్ టార్గెట్ చేసి వాయిదా వేసింది.అయితే ఆ మధ్యలో చాలా సినిమాలను 14 రీల్స్ బ్యానర్ విడుదల చేసింది. కానీ అఖండ-2 ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారనే డౌట్ కొంతమందికి రావచ్చు. అయితే 14 రీల్స్ బ్యానర్ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మధ్య చాలా రోజుల నుండి చర్చలు జరుగుతున్నాయట.

అయితే 14 రీల్స్ బ్యానర్ ఇప్పటివరకు కొన్ని సినిమాలు నిర్మించినప్పటికీ ఆ సినిమాల్లో చాలా వరకు నష్టాలు వచ్చాయని,ఒకవేళ సినిమా హిట్ అయినా కొద్ది వరకు లాభాలు మాత్రమే వచ్చాయని కప్పిపుచ్చుకుంటూ వచ్చారట. అలాగే మేము బాలకృష్ణ బోయపాటి కాంబోలో పెద్ద సినిమాని తీస్తున్నాం.ఆ సినిమాకి వచ్చిన లాభాలతో మీ డబ్బులు ఇచ్చేస్తామని తెలిపారట. అయితే వాళ్ల మాట నమ్మి ఈరోస్ ఇంటర్నేషనల్ ఇప్పటివరకు సైలెంట్ గానే ఉంది. ఆ తర్వాత మధ్యలో ఇద్దరి మధ్య చర్చలు జరిగాక నవంబర్ లోనే మా అప్పు కట్టేయాలని ఈరోస్ సంస్థ ఆదేశించిందట. అయితే ఈ విషయాన్ని 14 రీల్స్ బ్యానర్ సీరియస్గా తీసుకోకపోవడంతో చేసేదేమీ లేక ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్లు కోర్టులో కేసు వేశారు.దాంతో అఖండ-2 సినిమా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: