అల్లరి నరేష్ తాజా చిత్రం ‘యముడికి మొగుడు’. యమలోకంలో అల్లరి చేసే ఓ కుర్రాడి కథే ఈ చిత్రం. అయితే... ఇందులో నరేష్ విభిన్నమైన గెటప్ లలో కనిపిస్తాడని దర్శకుడు చెబుతున్నారు. నరేష్ రాముడుగానూ జోకర్ గానూ వేషాలు మారుస్తాడు. అంతేకాదు, ఈ చిత్రంలో నరేష్ వేసిన ఆడవేషం చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు దర్శకుడు సత్తిబాబు. ఈ గెటప్ లో నరేష్ చేయబోయే అల్లరి ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా చేస్తుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు మేమెంత ఎంజాయ్ చేశామో అంతకు పదింతలు ప్రేక్షకులు ఆనందిస్తారు అని భరోసా ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: