మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం రోజు మాట్లాడుతూ భారతదేశం పై పలు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా భారత దేశం సర్వనాశనం అయ్యిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనా అమెరికా కి రూ.742,32,600 కోట్లు (10 ట్రిలియన్‌ డాలర్లు) చెల్లించాలని ఆయన అన్నారు. ఫాక్స్ న్యూస్ తో మాట్లాడిన ఆయన చైనా 10 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ నష్ట పరిహారం ప్రపంచానికి చెల్లించాలని కానీ చైనాకి అంతకంటే ఎక్కువ చెల్లించే సామర్థ్యం లేదని అన్నారు. చైనా ఏదైనా చెల్లించాల్సి ఉందంటే అది అమెరికా ప్రభుత్వానికే అని ఆయన అన్నారు. వాళ్లు అనుకొని చేసినా.. అనుకోకుండా చేసినా.. వారు చేసిన పనికి ప్రపంచంలోని ఎన్ని దేశాలు సర్వనాశనం అయ్యాయో మనం చూడొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

"కరోనా విజృంభన అనేది ప్రమాదవశాత్తూ జరిగిన ఒక చర్య అని నేను బలంగా ఆశిస్తున్నాను. ( ఉద్దేశపూర్వకంగా కాకుండా) చైనా అసమర్థత లేదా ప్రమాదం వల్ల ఈ విపత్తు సంభవించి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. అలానే జరిగి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కరోనా కారణంగా నాశనమైన దేశాలు మళ్ళీ యథాస్థితికి రావడం అనేది జరగదు. మా దేశం బాగా దెబ్బతింది. ఇతర దేశాలు ఇంకా బాగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం భారతదేశం లో ఏం జరుగుతుందో చూడండి. కొద్ది నెలల క్రితం వరకు ఇండియా చాలా బాగుందని భారతీయులు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఇండియా ఎంత బాగుందో ఒకసారి చూడండి. ఇండియా ఇప్పుడు సర్వనాశనం అయ్యింది. వాస్తవానికి ప్రతి దేశం కూడా సర్వనాశనం అయింది..."

"అన్ని దేశాలను సర్వనాశనం చేసిన ఈ కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా విజృంభించింది? అనేవి తెలుసుకోవడం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఈ కరోనా ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా తెలుసని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా చైనా ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ప్రస్తుతం, వారి ఆర్థిక వ్యవస్థ, యూఎస్ ఆర్థిక వ్యవస్థ రెండు ఆర్థిక వ్యవస్థలు వేగంగా తిరిగి పుంజుకుంటున్నాయి" అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: