కాకి పిల్ల.. సబ్బు బిళ్ళ.. అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అంటూ చెప్పారు మహాకవి శ్రీశ్రీ. ఈరోజు టెక్నాలజీ మారుతున్న రోజుల్లో ఆయుధాలకు కాదేది అనర్హం అన్న విధంగానే మారిపోతుంది పరిస్థితి. రోజురోజుకీ టెక్నాలజీ లో వస్తున్న మార్పులు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ లను ఉపయోగించే వారు.. ఆ తర్వాత వైర్లెస్ ల్యాండ్ ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత కాలంలో డబ్బా ఫోన్ లు ఇక ఇప్పుడు అదిరిపోయే స్మార్ట్ఫోన్లు. ఇక అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి అన్ని రకాల పనులు చేసుకునే సౌకర్యం . ఇలా కొన్ని దశాబ్దాల నుంచి ఎంతో అద్భుతంగా టెక్నాలజీ లో మార్పులు వస్తూనే ఉన్నాయి.


 అయితే కేవలం మొబైల్స్ విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా చకచకా టెక్నాలజీ మారిపోతూనే ఉంది. మనిషి మెదడులో వచ్చిన చిన్న ఆలోచన పెను మార్పులకు కారణమవుతుంది. ఇక ఇప్పుడు అటు ఆయుధాలలో కూడా ఎంతో వినూత్నమైన టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాలో ఏకంగా ఒక స్మార్ట్ గన్  మీదికి వచ్చి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 కేవలం వెరిఫైడ్ యూజర్స్ తో మాత్రమే తుపాకులు పనిచేసే విధంగా ఇక ఇప్పుడు ఒక అద్భుతమైన స్మార్ట్ గన్ అమెరికాలోని మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ లో ఫింగర్ ప్రింట్ ఆధారంగా మొబైల్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇక యూజర్ కాకుండా వేరే ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్ తో  ఓపెన్ చేయాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు.. అచ్చంగా స్మార్ట్ గన్  కూడా వెరిఫైడ్ యూజర్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పని చేస్తుందట. ఇటీవలి కాలంలో అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ఈ స్మార్ట్ గన్ ని మార్కెట్లోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా ఫింగర్ ప్రింట్ తీసుకొని ఓటిపి వచ్చిన తర్వాత తుపాకీ పేలుతుందట. దీంతో ఎవరి పేరున తుపాకి లైసెన్స్ పొందారో వాళ్ళు మాత్రమే వాడటానికి అవకాశం ఉంటుందని తద్వారా అమెరికాలో గన్ కల్చర్ను  తగ్గించేందుకు అవకాశం ఉంటుందని కొత్త ఆవిష్కరణ తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: