ఇప్పటికే ఉక్రెయిన్ లో ఉన్న పలు నగరాలు తమ ఆధీనం లోకి తెచ్చుకున్న రష్యా సైన్యం ఇక ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ ను కూడా అధీనం లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సమయం లో అటు ఉక్రెయిన్ కూడా తక్కువ సైన్యం ఉన్నప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా ఎంతో వీరోచితం గా పోరాటం చేస్తూ ఉండటం గమనార్హం. ఇలాంటి సమయం లోనే ప్రపంచం లో పెద్ద దేశాలుగా కొనసాగుతున్న కొన్ని దేశాలు ఉక్రెయిన్ కి మరికొన్ని దేశాలు రష్యా కు మద్దతు తెలుపుతున్నాయి. ఇలాంటి సమయం లోనే భారత్ దౌత్య పరంగా ఎంతో ఊహాత్మక వ్యవహరిస్తోంది.
ఒకవైపు ఉక్రెయిన్ కు మరో వైపు రష్యాకు కూడా మద్దతు తెలపకుండా తటస్థం గానే ఉన్న భారత్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అంటూ స్టేట్మెంట్ ఇస్తోంది. ఇక ఇలాంటి సమయంలో రష్యాను భారత్ వ్యతిరేకించక పోవడంతో రష్యా ప్రస్తుతం భారత్ కి భారీ ఆఫర్ ఇచ్చింది అని అర్థమవుతుంది. రష్యన్ ఆయిల్ ఫామ్స్ భారత్ కి బీట్బిగ్ డిస్కౌంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా 27 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయ్ అక్కడ ఆయిల్ఫామ్ కంపెనీలు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి