ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం మొదలై పది రోజులు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు కనిపించడం లేదు. అటు రష్యా  ఉక్రెయిన్ పై అదే రీతిలో విరుచుకుపడుతూ భీకర రీతిలో దాడులకు పాల్పడుతూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలో ఇక అటు రష్యా సేనలను ఎదుర్కొనేందుకు చిన్న దేశమైన ఉక్రెయిన్ సర్వశక్తులూ ఒడ్డుతుంది అనే చెప్పాలి. ఎక్కడ వెనకడుగు వేయకుండా ఎంతో వీరోచితంగా ఉక్రెయిన్ సైన్యం ప్రస్తుతం పోరాటం సాగిస్తూ ఉండడం గమనార్హం.


 రష్యా ఎన్ని బెదిరింపులకు పాల్పడిన  వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నీ వెనుక మేమున్నాం అంటూ అమెరికా యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు మద్దతు ఇచ్చాయి. ఇక ఎలాంటి సహకారం అందించడానికి అయినా సిద్ధంగా ఉన్నాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాయ్. తీరా ఇప్పుడు రష్యా యుద్ధానికి దిగిన తర్వాత మాత్రం ఉక్రెయిన్ కు ఎలాంటి ఆయుధాలు సైనిక సహకారం అందించకుండా కేవలం రష్యా పై ఆంక్షలు మాత్రమే విధిస్తూ సరిపెట్టుకుంటున్నాయ్ ఆయా దేశాలు. దీంతో ఏకంగా ఒక అగ్ర దేశం రష్యాతో పసికూన లాంటి ఉక్రెయిన్ ఒంటరిగానే పోరాటం చేస్తోంది.



 తమ సార్వభౌమత్వాన్ని రష్యా దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేము అంటూ ఉక్రెయిన్ చెబుతూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇక ఉక్రెయిన్ లో మారణహోమం సృష్టించడానికి సిరియాకు చెందిన నరహంతకులు లాంటి కొంతమంది ఫైటర్స్ ని రష్యా ఉక్రెయిన్లో దింపింది ఇటీవలే  చివరకు అమెరికా చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు రష్యా కూడా అమెరికాపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉండటం గమనార్హం. ఉక్రెయిన్ కు మద్దతుగా సిరియాకు చెందిన మరో గ్రూప్ ను అమెరికా రంగంలోకి దింపి ఉందని.. ఇక వాళ్ళు ఉక్రెయిన్ తరఫున  పోరాటం చేయడమే కాదు రష్యా సైన్యాన్ని హతమార్చేందుకు రంగంలోకి దిగారు అంటూ  రష్యా మీడియా చెబుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: