
ఇక ఇప్పుడు ఒక మహిళ కూడా ఏకంగా గిన్నిస్ బుక్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. తన ప్రాణాలనే పణంగా పెట్టి రిస్క్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆమె ధైర్యానికి ప్రస్తుతం పలువురు ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన అంబర్ పిల్లర్ అనే మహిళ రెండు వందల తొంబై ఐదు అడుగుల 3 అంగుళాల దూరం ఈదుతూ రెండోసారి తన రికార్డును బద్దలు కొట్టింది. అయితే రెండేళ్ల క్రితం నార్వేలో 229 అడుగులు 7.9 అంగుళాల దూరం ఈది మొదటిసారి గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేసింది కూడా అంబర్ పిల్లర్ కావడం గమనార్హం.
ఇటీవలే అంబటి పిల్లర్ మంచూ నీటిలో డైవింగ్ చేస్తూ సూట్ లేకుండానే ఈదింది. గిన్నిస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గిన్నిస్ బుక్ రికార్డు సాధించడానికి ఆమె తన ప్రాణాలనే ఫణంగా పెట్టడం పై ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే క్రొయేషియా కు చెందిన విడో మీర్ మారిసిక్ అనే వ్యక్తి అంతకు ముందు మూడు నిమిషాల 6 సెకన్లు 351 అడుగులు 11.5 అంగుళాల దూరం ఈది గిన్నిస్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.