వెర్రి వేయి రకాలు అని చెబుతూ ఉంటారు.. కొంతమంది  చేసే పనులు చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిత్ర విచిత్రంగా ఆలోచిస్తూ అందరినీ అవాక్కయ్యే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. సాధారణంగా ఎవరికైనా కుక్క ఇష్టం అయితే వెంటనే వెళ్లి ఒక అందమైన కుక్కను పెంచుకోడానికి తెచ్చుకుంటూ వుంటారు. ఇది అందరూ చేసే పని. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించాడు. అతనికి కుక్కలు అంటే ఎంతో ఇష్టం వాట్ ఇలాగే జీవించాలని అనుకున్నాడు  దీంతో మనుషుల్లా ఉండడం కంటే కుక్కలా మారిపోవడమే బెటర్ అని భావించాడు.


 చివరికి లక్షల రూపాయలు ఖర్చు చేసి కుక్కలా మారిపోయాడు. ఈ ఘటన జపాన్లో వెలుగులోకి వచ్చింది. టోకో ఇవి అనే వ్యక్తి తనను తాను కోలి జాతి కుక్కలా మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు అని చెప్పాలి. అంతేకాదండోయ్ మనిషి నుంచి కుక్క రూపంలోకి మారేందుకు 40 రోజులు కష్టపడగా.. ఏకంగా 12 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. జెప్పేట్ అనే సంస్థ సినిమాలు వాణిజ్య ప్రకటనలు వినోద కార్యక్రమాల కోసం పెద్దఎత్తున శిల్పాలను తయారు చేస్తూ ఉంటుందట. ఈ క్రమంలోనే టోకో ఇవి అనే వ్యక్తి తాను పూర్తిగా కుక్కలా కనిపించాలనే కోరిక నువ్వు సదరు సంస్థకు తెలపగా.. ఎంత ఖర్చయినా భరిస్తారు అంటూ చెప్పాడు. ఇలా కోలి జాతి కుక్కలా 40 రోజులు కష్టపడి మరీ ఆ సంస్థ ప్రతినిధులు అతన్ని మార్చేశారు. మేకప్ ఇతర ఖర్చుల కోసం ఇక అతనికి ఇంకా ఎక్కువగానే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక ఈ ఫోటోలు వీడియోలు చూసి ఓరి వీడి వెర్రితనం తగలెయ్య మరి ఇంత క్రియేటివిటీ ఏంటి అని అనుకుంటున్నారు. మరికొంతమంది ఇలా ఇలాంటివి చూసి సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు. ఇక కింద ఉన్న వీడియో ని చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి బాసూ..

మరింత సమాచారం తెలుసుకోండి: