ఒకప్పుడు నేటి రోజుల్లో లాగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా ఏదైనా వ్యాధి వస్తే దానిని నయం చేసుకొనేందుకు మందులు లేవు. కానీ ఎన్ని వ్యాధులు వచ్చినా తట్టుకుని నిలబడి ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. కానీ నేటి రోజుల్లో ఆధునిక సమాజం లోకి అడుగుపెట్టిన తర్వాత అధునాతన టెక్నాలజీతో కూడిన వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మనిషి ప్రాణాలు ఎప్పుడు పోతాయో అన్నది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న వైరస్ లు. ఒక వైరస్ ప్రభావం తగ్గింది అనుకునే లోపు మరో కొత్త వైరస్ వచ్చి మనుషులకి ప్రాణాంతకంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.



 వెరసి నేటి ఆధునిక సమాజంలో కూడా ప్రతి మనిషి అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఆబోలా అనే ఒక వైరస్ వచ్చి ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకునే లోపే కరోనా వైరస్ వచ్చి విధ్వంసం సృష్టించారు. ఇప్పటికీ కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మనుషుల ప్రాణాలు కాపాడుకోవడానికి చివరికి మూగజీవాలను సైతం ప్రాణాలు తీసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే.


 ఆస్ట్రేలియాలో అధికారులు ఏకంగా లక్షల తేనెటీగలు చంపేస్తున్నారు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా తేనెటీగలను చంపేయడానికి కారణం వారోవామైట్ అనే పరాన్నజీవి అన్నది తెలుస్తుంది. తేనె ఉత్పత్తి కేంద్రాల నుంచి ఒక్క తేనెటీగ కూడా బయటికి పోనీయకుండా ఇక బయట నుంచి లోపలికి రానివ్వకుండా కఠిన చర్యలు చేపట్టారు అధికారులు. వారోవామైట్ వల్ల తేనెటీగలలో ప్లేగు వ్యాధి వ్యాపిస్తుందట. అందుకే ఇక ఈ వ్యాధి ఆనవాళ్లు కనిపించిన చోట లక్షల తేనెటీగలను అధికారులు చంపేస్తున్నారు అని చెప్పాలి. కోట్ల డాలర్ల విలువైన తేనె ఉత్పత్తి పరిశ్రమను కాపాడేందుకు అధికారులు ఇలా తేనేటీగలను చంపేస్తున్నారు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: