సాధారణంగా ఆర్టిసి బస్సులో సీటు కోసం ప్రయాణికులు కొట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఈ సీట్ నాది అంటే నాది అని కొట్టుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అచ్చం ఆర్టీసీ బస్సులో కొట్టుకున్నట్లుగానే అటు మెట్రో ట్రైన్ లో కూడా ప్రయాణికులు కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం. కొంతమంది సీట్ కోసం కొట్టుకుంటే ఇంకొంతమంది చిత్రవిచిత్రమైన కారణాలతో ఇలా గొడవ పడటం చేస్తూ ఉంటామ్. ఇలా ఇటీవల కాలంలో మెట్రో ట్రైన్ లో ఎంతో మంది ప్రయాణికులు గొడవ పడుతున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారింది. అయితే మెట్రోలో గొడవ అనగానే అందరూ ముంబై మెట్రో అనుకునేరు. ఈ గొడవ జరిగింది మన దేశంలో కాదు ఏకంగా న్యూయార్క్ లో ఉన్న మెట్రోలో. ఏకంగా పక్కన ఉన్న ఒక ప్రయాణికుడు తన భుజంపై నిద్రలో తలవాల్చాడు అన్న కారణంతో ఇక మరో ప్రయాణికుడు ఏకంగా మోచేతితో దారుణంగా దాడికి దిగాడు. ఇక ఇది చూసిన నేటిజన్స్  షాక్ అవుతున్నారు  ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది. పొరపాటున భుజంపై వాలితే  ఇలా కొడతారా అని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.


 న్యూయార్క్ లోని మెట్రో రైల్లో ఫారెస్ట్ హిల్స్ 71 వ ఎవెన్యూ స్టాప్ సమీపంలో సబ్ వేకు చేరే సరికి ఉదయం 5:30 గంటల సమయం అవుతుంది. అయితే నిద్రలో పక్కనే ఉన్న ఒక ప్యాసింజర్ భుజంపై అనుకోకుండా వాలిపోయాడు ఒక వ్యక్తి. అయితే ఆ ప్యాసింజర్ వాగ్వాదానికి  దిగాడు. నిద్రలో ఉన్న వ్యక్తి స్నేహితులు ఆ ప్యాసింజర్ తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రయత్నం లేకుండా పోయింది. ఇక ఆగ్రహంతో పక్కనే ఉన్న వ్యక్తిని మోచేతితో బలంగా దాడి చేశాడు. అయితే అతని దెబ్బలకు పక్కనే ఉన్న వ్యక్తి మూర్చపోయాడు. అయితే బాధితుడి స్నేహితులు అతనితో గొడవకు దిగారు  దీంతో ఒకరిపై ఒకరు పిడుగులు కురిపించుకున్నారు. దీంతో మెట్రో కంపార్ట్మెంట్ కాస్త రణరంగంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: