ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే. సాధారణంగా అక్కడక్కడ కిడ్నాప్లు జరగడం చూస్తూ ఉంటాం. అచ్చం కొన్ని సినిమాల్లో చూపించినట్లుగానే కిడ్నాప్ లు చేసి కిడ్నాపర్లు భారీగా డబ్బు డిమాండ్ చేయడం చేస్తూ ఉంటారు. ఇంకొంద మంది ఏకంగా ప్రాణాలు తీయడం కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా మనుషులు మనుషులను కిడ్నాప్ చేయడం గురించి ఇప్పటివరకు సినిమాల్లో చూడటమే కాదు నిజజీవితంలో కూడా ఇలాంటి తరహా ఘటనల గురించి విన్నాం. కానీ కారు ఒక మనిషిని కిడ్నాప్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.
ఊరుకోండి బాసు.. కారు మనిషిని ఎందుకు కిడ్నాప్ చేస్తుంది. అలా కిడ్నాప్ చేయడం కారుకు ఏం అవసరం.. దానికి ఏమైనా ప్రాణం మనుషుల్లాగా భావోద్వేగాలు ఉంటాయా కిడ్నాప్ చేయడానికి అని అంటారు ఎవరైనా.. కానీ ఇక్కడ మాత్రం నిజంగానే కారు మనిషిని కిడ్నాప్ చేసింది. యూకే లో ఈ ఘటన జరిగింది. గ్లాస్గోలో మోరీసన్ అనే వ్యక్తి ఉంటున్నాడు అయితే తన సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రికల్ కారులో కిడ్నాప్ అయ్యాడు అయితే సినిమాలో మాదిరిగా ఎవరు ఆపరేట్ చేయలేదు. సాంకేతిక సమస్యతో కారుపై అతను నియంత్రణ కోల్పోయాడు. బ్రేక్స్ స్టీరింగ్ పనిచేయలేదు ఇక పోలీసులకు ఫోన్ చేసి చెప్పగా. వాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే వెంటనే అప్రమత్తమై సమయస్పూరితో రోడ్డుకి కార్లు అడ్డంగా పెట్టడంతో ఇక ఆ కారు ఆగిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి