ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. కేవ‌లం సంక్షేమం అన్న ప‌దం బేస్ చేసుకునే జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతోంది. ఏపీలో అభివృద్ధికి పెద్ద‌గా స్కోప్ లేద‌నే అంటున్నారు. ఇక జ‌గ‌న్ పాల న గురించి ఎప్పుడూ లోక‌ల్ మీడియాలోనే చ‌ర్చ జ‌రుగుతుందే త‌ప్పా అస‌లు జాతీయ మీడియా జ‌గ‌న్‌ను ప‌ట్టించుకుంటోన్న దాఖ‌లాలు అయితే లేవు. జగన్ కు జాతీయ మీడియాలో అంత చోటు లేకుండా పోయింద‌న్న‌ది వాస్త‌వం. అయితే వైసీపీ ప్ర‌భుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తుండ‌డంతో పాటు కొన్ని ప‌థ‌కాలు త‌మ రాష్ట్రంలో అమ‌లు చేసేందుకు  కూడా రెడీ అవుతున్నాయి.

ఇంత జ‌రుగుతున్నా జ‌గ‌న్ కు మాత్రం జాతీయ మీడియాలో ఏ మాత్రం స్కోప్ ఉండ‌డం లేదు. మ‌రో వైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల లో ఏ పార్టీ కూడా ఏకంగా నూటికి నూరు శాతం ఫ‌లితాలు సాధించ లేదు. జ‌గ‌న్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అయినా కూడా జ‌గ‌న్ గురించి జాతీయ మీడియా ప‌ట్టించుకున్న ప‌రిస్థితి అయితే లేదు. దీనికి కార‌ణం ఏంట‌న్న‌ది ప్ర‌శ్నించు కుంటే జ‌గ‌న్ గురించి జాతీయ మీడియాకు ఫీడ్ బ్యాక్ ఇచ్చే వాళ్లు కూడా ఆ పార్టీలో లేర‌నే అంటున్నారు.

చంద్రబాబు ముఖ్య‌మంత్రి గా ఉండగా అమరావతి నుంచి పోలవరం వరకూ జాతీయ స్థాయి మీడియాలో ఓ రేంజ్‌లో హైలెట్ అయ్యేవి. ఇక బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న గురించి వ‌చ్చే వార్త‌లు అయితే మామూలుగా ఉండ‌వు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ బంప‌ర్ మెజార్టీ తో అధికారంలోకి వ‌చ్చినా కూడా జాతీయ మీడియాలో ఆయ‌న గురించి చిన్న వార్త‌లు కూడా రావ‌డం లేదు. ఇక ఆ పార్టీ నేత‌లు కూడా జాతీయ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

చంద్ర‌బాబు జాతీయ మీడియా ప్ర‌తినిధుల‌తో క‌నీసం వారినికి రెండు మూడు సార్లు కూడా విందు స‌మావేశాల్లో పాల్గొనే వారు . అయితే ఇప్పుడు జ‌గ‌న్ అస‌లు లోక‌ల్ మీడియానే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. ఇక జాతీయ మీడియాను ఆయ‌న ప‌ట్టించు కోక‌పోవ‌డంతో వాళ్లు కూడా జ‌గ‌న్‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టాక్ ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: