టిడిపి అధినేత , ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఎప్పుడు ఆవేశంగా ప్రకటన చేసేందుకు ఇష్టపడరు. ఆయన ఏ విషయంలో అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా ప్ర‌హ‌స‌నంతో కూడుకుని ఉంటాయి. తాజాగా చంద్రబాబు అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన కుటుంబ వ్యవహారాలను వైసిపి నేత లు ప్రస్తావించడంతో బాబు తీవ్ర ఆవేద‌న చెందిన‌ సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తాను మళ్లీ ముఖ్యమంత్రి అయితే నే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్న‌ర‌ సంవత్సరాలు టైం ఉంది. ఇటు శాసనసభలోనూ అటు శాసనమండలిలో ను కలిపి టిడిపికి 30 మందికి పైగా సభ్యుల బలం ఉంది. ఇలాంటి టైంలో బాబు పోరాటం చేయ‌కుండా బ‌య‌ట ఉంటే జ‌నాల్లో నెగిటివ్ వ‌స్తుందా ? అన్న సందేహాలు టిడిపి వాళ్ళకు వస్తున్నాయి. మరోవైపు రాజ‌ధాని బిల్లును స‌రి కొత్త‌గా మ‌ళ్లీ అసెంబ్లీ లోకి తీసుకువస్తామని వైసిపి చెబుతోంది.

ఇలాంటి సమయంలో చంద్రబాబు అసెంబ్లీలో లేకపోతే ప్రజల్లో బాబు పై వ్యతిరేకత వస్తుందా ?  అమ‌రావ‌తి రైతుల ప‌క్షాన బాబు లేర‌న్న అభిప్రాయం క‌లుగుతుందా ? పార్టీ పై న‌మ్మ‌కం మ‌రింత స‌న్నిగిల్లు తుందా ? అన్న సందేహాలు ఇప్పుడు చంద్రబాబుతో పాటు టిడిపి వాళ్ళకు కలుగుతున్నాయి. బిల్లు అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ళ్లీ ఏ మాత్రం వ్య‌తిరేకంగా ఉన్నా కూడా అప్పుడు అసెంబ్లీలో గ‌ట్టి గా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం బాబుకు ఎంతైనా ఉంది.

లేక‌పోతే ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతుంటే బాబు అసెంబ్లీ లేర‌న్న అభిప్రాయం బ‌లంగా ప్ర‌జ‌ల్లో ఉంటుంది. ఇది అంతి మంగా బాబు కు పెద్ద మైన‌స్ అవ్వ‌డం ఖాయం. అందుకే చంద్రబాబు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తిరిగి అసెంబ్లీకి వస్తార‌ని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: