మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా పరిశ్రమలో ఏ విధంగా ఆదరిస్తారో సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలను స్టార్ హీరోలను ఎంతవరకు గుండెల్లో పెట్టుకుంటారు అనేది మనం కొన్ని దశాబ్దాల నుంచీ చూస్తూనే ఉన్నాం. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపుగా అగ్రహీరోల అందర్నీ కూడా తమ ఇంట్లో దైవంగా కొలిచే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. అగ్రహీరోల పుట్టినరోజుకి తన అభిమాన నటులు పుట్టినరోజుకి రక్తదానం అన్నదానం చేసే అభిమానులు కూడా చాలా మంది ఉంటారు.

అయితే ఇప్పుడు ఆ అభిమానులకు కష్టం వస్తే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనబడటం లేదు అనే మాట వాస్తవం. రాయలసీమ ప్రాంతంలో సినిమా పరిశ్రమ మీద చాలామంది అభిమానంతో వారిని ఎక్కువగా ఆదరించే ప్రయత్నం చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాటుకుంటున్నారు. అయితే రాయలసీమ ప్రాంతం లో వరదలు వచ్చిన సమయంలో ఏ అగ్రహీరో కూడా ముందుకు వచ్చి వాళ్ళ కోసం సహాయం చేసిన పరిస్థితి కనపడటం లేదు.

చాలా మంది అగ్ర హీరోలు కేవలం సోషల్ మీడియా ప్రకటనలకు పరిమితం కావడం తమ సినిమాల షూటింగ్ల కోసం రాయలసీమ వాడుకోవడమే గాని ఎక్కడా కూడా రాయలసీమ ప్రాంతంలో ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం పరామార్శించడానికి  కూడా వెళ్లడం లేదు. తమ సినిమాలు ఏదైనా విడుదలవుతున్న లేదా తమ సినిమాలకు సంబంధించి ఏమైనా ప్రకటనలు వస్తుందా సరే అభిమానులను మాయ చేయడానికి ఏదో ఒక రూపంలో పోస్టర్లు విడుదల చేయడం లేకపోతే వీడియోలు విడుదల చేసి వాళ్ళను ప్రమోషన్ చేయించే విధంగా వాడుకోవడం చేస్తే కనీసం వాటిని పట్టించుకోక పోవడం అనేది ఇప్పుడు దారుణమైన అంశంగా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: