గత ఎన్నికల తర్వాత టీడీపీలో మహిళా నేతలు పూర్తిగా సైలెంట్ అయిన విషయం తెలిసిందే. అసలు టీడీపీలో లేడీ లీడర్స్ ఉన్నారా? అనే పరిస్తితి కనిపించింది. అంతలా టీడీపీలో మహిళా నేతలు కనిపించకుండా వెళ్ళిపోయారు. పలు నియోజకవర్గాలు లేడీ లీడర్స్ చేతిలోనే ఉన్నా సరే, యాక్టివ్‌గా పనిచేయలేదు. గత రెండు ఏళ్లుగా టీడీపీలో మహిళా నేతలు పెద్దగా కనిపించలేదు.

కానీ నిదానంగా ఏపీలో సీన్ మారుతూ వస్తుంది. వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయం మారుతుంది. ఈ పరిస్తితుల్లో టీడీపీ నేతలు దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. తమదైన శైలిలో వైసీపీపై పోరాటాలు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో మహిళా నేతలు కూడా యాక్టివ్ అయ్యారు. పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అయితే మొదట నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత టీడీపీలో దూకుడుగానే పనిచేస్తున్నారు. ఇక ఆమె బాటలో పలువురు మహిళా నేతలు వచ్చారు.

రాష్ట్రంలో ఉండే సమస్యలపై గళం విప్పుతూనే, తమ తమ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం మొదలైంది. ఇదే టీడీపీ మహిళా నేతలకు అడ్వాంటేజ్ అయింది. దీంతో పలు నియోజకవర్గాల్లో టీడీపీ మహిళా నేతలు పుంజుకున్న పరిస్తితి కనిపిస్తోంది.

పలాసలో గౌతు శిరీష స్ట్రాంగ్ అయ్యారు. మామూలుగానే పలాస టీడీపీ కంచుకోట. కానీ గత ఎన్నికల్లో శిరీష ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ మంత్రి అప్పలరాజుకు ధీటుగా శిరీష్ పుంజుకున్నారు. ఇక సాలూరులో గుమ్మడి సంధ్యారాణికి కూడా ప్లస్ కనిపిస్తోంది. ఇటు శృంగవరపుకోటలో లలితకుమారి, పాడేరులో ఈశ్వరి, రంపచోడవరంల్లో రాజేశ్వరిలు సైతం స్ట్రాంగ్ అయ్యారు. రాప్తాడులో సునీతమ్మ, ఆలూరులో సుజాతమ్మల పరిస్తితి కూడా మెరుగ్గానే కనిపిస్తోంది. అయితే ఇంకా కొందరు మహిళా నేతలు పుంజుకోవాల్సి ఉంది. ఎన్నికల నాటికి ఇంకా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: