ఇటీవలే తెలంగాణ లో ప్రతిపక్షం అడిగిందని అధికార పార్టీ తాము చేసిన పనులను చూపించారు.. అలాంటి పరిణామం అరుదే అయినప్పటికీ ప్రజలకు అది ఎంతో కన్నుల పండుగగా ఉంది. ఈ తరహా పరిణామం ప్రతినెలా లేకపోతే ప్రతి సంవత్సరం చూస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఒక చట్టాన్ని తెస్తే ఏ రాష్ట్రమైన యిట్టె అభివృద్ధి చెందుతుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం, అధికార పక్షాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఇద్దరు కలిసి పనిచేస్తారని ఎవరు అనుకోరు.. కానీ ఓ నియోజక వర్గంలో మాత్రం వైసీపీ, టీడీపీ లు రెండు పార్టీ లు కలిసి పనిచేస్తున్నారట.