
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అంతర్జాతీయ యోగా వేడుకలు ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్తోపాటు న్యూయార్క్ లోని గవర్నర్స్ ఐలాండ్లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో అమెరికాలో భారత రాయబారితోపాటు దౌత్యాధికారులు, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో పాల్గొన్నారు. ఈ ఏడాది శాంతి కోసం యోగా పేరుతో నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల కార్యక్రమాలు జరుగుతాయని ఆయుష్ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా మోదీ ‘ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మనిషిని ప్రశాంతంగా ఉంచే సాధనం యోగా.

మనిషి శరీరం, మెదడు, ఆత్మలను ఒకదానితో ఒకటి సమన్వయ పరిచి మనకు మానసిక ప్రశాంతతను చేకూర్చే దివ్య ఔషదం యోగా. డెహ్రాడూన్ నుంచి డబ్లిన్, షాంగై నుంచి చికాగో, జకర్తా నుంచి జోహాన్సబర్గ్ వరకూ ప్రాంతంతో సంబంధం లేకుండా యోగా విస్తరిస్తుంది. ఈ రోజు ప్రపంచాన్నంతా ఏకం చేసే శక్తి యోగాకు ఉంది’ అన్నారు.
ముంబై మెరినా బీచ్లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీ. విద్యాసాగర్ రావు నేతృత్వంలో రాజ్ భవన్లో యోగా దినోత్సావాన్ని నిర్వహించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తో పాటు గా యోగా గురువు బాబా రాందేవ్, ఆచార్య బాలక్రిష్ణ కూడా పాల్గొన్నారు. యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
అరుణాచల్ ప్రదేశ్ ఇండో- టిబెటన్ బార్డర్ పోలీసు సైనికులు కాస్తా విభిన్నంగా నీటిలో యోగా చేసారు. లోహిత్పూర్ ‘దిగారు’ నదిలో సైనికులు యోగాసానలు వేసారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
yoga-day-2018
international yoga day -2018
international yoga day
celebrations
pm modi
vidya sagar rao
baba ramdev
ap political updates
telugu political news
latest news
latest ap updates
political news
indian politics
international news
national news
tollywood news
bollywood news
kollywood news
hollywood newsandhra pradesh politics
andhra politics
telugu political news
apherald news
apherald politics news
latest politics news
politics
latest news