ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ మారుతున్నారా…? అంటే ఈ సారి ప‌క్కాగా అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి. అవినాష్ కొంత కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న మాట అయితే నిజ‌మ‌నే అంటున్నాయి కృష్ణా జిల్లా పార్టీ వ‌ర్గాలు. అస‌లు అవినాష్ అసంతృప్తికి చాలా కారాణ‌లే ఉన్నాయి. గుడివాడ‌లో త‌న‌ను బ‌ల‌వంతంగా పోటీ చేయించ‌డం ద‌గ్గ‌ర నుంచి అక్క‌డ పార్టీ నేత‌లు వెన్ను పోట్లు పొడిచినా ప‌ట్టించుకోక‌పోవ‌డం.... ఓడిపోయాక అవ‌మానాలు.. ఇప్పుడు కూడా త‌న‌కు, త‌న ఫ్యామిలీకి ప‌ట్టున్న విజ‌య‌వాడ తూర్పు, పెన‌మ‌లూరు లాంటి సీట్లు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతుండ‌డం అవినాష్‌కు న‌చ్చ‌లేదు.


వాస్త‌వానికి కొద్ది రోజుల క్రిత‌మే అవినాష్ పార్టీ మార‌తాడ‌ని.. ఆయ‌న విజ‌యసాయిరెడ్డితో భేటీ అయ్యాడ‌ని.. విజ‌య‌వాడ తూర్పు సీటు బాధ్య‌త‌లు ఇచ్చేందుకు వైసీపీ నుంచి హామీ వ‌చ్చింద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. అయితే ఆ త‌ర్వాత వాటిని అవినాష్ ఖండించాడు. ఇక తాజా అప్‌డేట్ ప్ర‌కారం అవినాష్ పార్టీ మార‌డం ఖాయ‌మైంద‌ని... మూడు నాలుగు రోజుల్లోనే అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పేసే అవ‌కాశం ఉంద‌న్న‌ది విజ‌య‌వాడ వ‌ర్గాల టాక్‌..!


ఇక అవినాష్ పార్టీ మారేందుకు వినిపిస్తోన్న కార‌ణాల్లో గుడివాడ‌లోనే ఇంకా త‌న‌ను కంటిన్యూ చేయ‌డం ఓ కార‌ణం అయితే... పెనమలూరు సీటు ఇస్తామని చెప్పి ఇప్పుడు ప‌ట్టించుకోక‌పోవ‌డం అట‌. ఇక ఇప్పుడు గ‌న్న‌వ‌రంలో పోటీ చేసేందుకు ఇష్టం లేక‌పోయినా లోకేష్ ప్రెజ‌ర్ చేస్తుండ‌డం కూడా అవినాష్‌కు ఎంత మాత్రం న‌చ్చ‌డం లేద‌ట‌. ఇక స్థానిక నాయ‌కులు గుడివాడ‌లో ప‌దే ప‌దే త‌న మీద పైకి లేనిపోని ఫిర్యాదులు చేసి త‌న‌కు పొగ పెడుతుండ‌డంతో అవినాష్‌కు తీవ్ర‌మైన అస‌హ‌నం క‌లుగుతోంద‌ని టాక్‌. ఈ క్ర‌మంలోనే వైసీపీలో త‌న‌కు ల‌భించే ప్రయార్టీపై హామీ తీసుకుని పార్టీ జంప్ చేయ‌డ‌మే బెట‌ర్ అని భావిస్తున్నార‌ట‌.



మరింత సమాచారం తెలుసుకోండి: