రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయారెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మధ్యాహ్న సమయంలో సురేష్ అనే రైతు  తహసిల్దార్ విజయారెడ్డి కార్యాలయంలో ప్రవేశించి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో తహసిల్దార్ విజయారెడ్డిని  సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో  రెవెన్యూ ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాసిల్దార్ విజయ రెడ్డి హత్య ఎఫెక్ట్ ఇప్పటికీ  రెవెన్యూ అధికారుల్లో  కనిపిస్తోంది. తమ దగ్గరికి పని కోసం వచ్చే ప్రజలు ఎప్పుడు ఇలా ఎక్కడి నుంచి దాడి చేస్తారోనంటూ  భయపడుతూనే  ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం రెవిన్యూ ఉద్యోగులకి . అయితే తహసిల్దార్ విజయా రెడ్డి హత్య పై  రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టిన విషయం తెలిసిందే. 

 

 

 

 అటు అధికారులు కూడా లంచం తీసుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు లంచం తీసుకోవడం లేదు అంటూ బోర్డులు  కూడా పెడుతున్నారు. కొంతమంది ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తహసీల్దార్  విజయ రెడ్డి హత్య తర్వాత చాలా మంది రెవెన్యూ ఉద్యోగులు సక్రమంగా పని చేస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు.  విజయ రెడ్డి హత్య తర్వాత కూడా రెవెన్యూ ఉద్యోగులకు  పెట్రోలు పోసి తగలబెడతం  అంటూ ఎన్నో బెదిరింపులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో  పెట్రోల్ విక్రయించవద్దని రూల్  కూడా పెట్టండి. ఇదిలా ఉండగా తాజాగా మరో రెవెన్యూ అధికారి పై పెట్రోల్ దాడి జరిగింది. తమ భూ  సమస్యలు పరిష్కరించడం లేదని రైతు రెవిన్యూ  అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రయత్నం చేసాడు . అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు కానీ రెవిన్యూ సిబ్బంది మొత్తం భయాందోళనకు గురయ్యారు. 

 

 

 తన భూ సమస్య పరిష్కరించడం లేదని ఆగ్రహించిన రైతులు రెవిన్యూ  సీనియర్ అసిస్టెంట్ పై పెట్రోల్ పోసి ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. చిగురుమామిడి తహసిల్దార్ కార్యాలయంకీ  లంబాడి పల్లి కి చెందిన రైతు కనకయ్య వెళ్ళాడు . భూ సమస్య పరిష్కరించమని కోరిగా .. రైతు కనుకయ్య  యొక్క సమస్యలు పరిష్కరించేందుకు సీనియర్ అసిస్టెంట్ రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు కనకయ్య రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ రామచంద్రన్  పై పెట్రోల్ పోసి హల్ చల్ చేశారు. కంప్యూటర్లపై కూడా పెట్రోల్ పోసాడు . దీంతో వెంటనే అక్కడున్న రెవిన్యూ సిబ్బంది అలెర్ట్ అయ్యి... రైతు కనకయ్యను  అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలికి  చేరుకున్న పోలీసులు రైతును అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భూ సమస్యను పరిష్కరించడం లేదని రెవెన్యూ అధికారిపై  పెట్రోల్ పోసినట్లు  రైతు కనకయ్య  చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: