మామూలుగా అయితే పాములను చూసే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడకైనా వెళుతుంటే పాము కనిపించింది అంటే ఇక అంతే కిలోమీటర్ దూరం పరుగో పరుగు. ఒకవేళ ఏదైనా పాము ఉండే ప్రదేశానికి వెళ్ళారనుకోండి ఆచితూచి అడుగులు వేస్తారు. ఒకవేళ ఎక్కడైనా పాము ఉందని అనుమానం వచ్చింది అనుకొండి ఇక అంతే అవసరమున్న అటువైపు వెళ్లడమే మానేస్తారు. పాములంటే  బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అరే చిన్నపిల్లలైతే పాముల చూడడం కాదు పాము  పేరెత్తితేనే పరుగులు తీస్తారు. పామును పట్టుకుని పాము తో ఆడుకోవడం ఇలాంటివి చేస్తారా... అమ్మో పాము తో ఆడుకోవడం... మా వల్ల కాదు బాబోయ్ అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఈ పిల్లలు మాత్రం పాముతో తాడు ఆట ఆడుతున్నారు. చక్కగా  ముగ్గురు చిన్నారులు పామును తాడుగా వాడి స్కిప్పింగ్ చేస్తున్నారు. ఏదో తెలీక అలా చేసి ఉంటారు అంటారా... అబ్బే అలాంటిదేమీ లేదండ అని తెలిసి ఆ పాముతో ఆడేసుకుంటున్నారు ఇక్కడ చిన్నారులు. 

 

 

 

 పాము పేరెత్తితేనే అల్లంత దూరం పారిపోవలసి చిన్నారులు కాస్త ఆ పాము తోనే  బాగా ఆడుకుంటున్నారు. పామును పట్టుకుని తాడాట ఆడడం ఏంటి వినడానికి ఒళ్ళు జలదరిస్తుంది అంటారా... ఒళ్ళు జలదరించినా... పులకరించిన ఇది మాత్రం నిజమే. ఈ  ఘటన వియత్నాం లో చోటుచేసుకుంది. ఓ పామును పట్టుకుని తాడుగా వాడి  ఎలాంటి భయం లేకుండా ఆ చిన్నారుల  ఆడడం  చూస్తుంటే గుండె గుబేలు మంటుంది . ఈ చిన్నారులు  పట్టుకున్నది ఏదో చిన్నాచితక పాము కాదండోయ్ ఆ చిన్నారుల కంటే ఆ పాముపొడవు  గానే ఉంది. ముగ్గురు చిన్నారులు కలిసి ఎంచక్క పాము తలని ఒకరు పాము తోక ని ఒకరు పట్టుకుని అటూ ఇటూ ఊపుతుంటే మధ్యలో ఓ చిన్నారి నిలబడి ఆ పాము  మీద నుంచి అటు ఇటు జంప్ చేస్తుంది . కాస్తయినా భయం లేకుండా ఆ పామును తాడుగా వాడుతూ ఆట ఆడుతున్నారు ఇక్కడ చిన్నారులు. 

 

 

 

 పిల్లలు అలా పాముతో తాడట  ఆడుతుంటే... వారిని మందలించి ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పాల్సిన మహిళా కాస్త వారిని ఇంకా బాగా ఆడాలి అంటూ  ఎంకరేజ్ చేస్తూ ఉంది . అటు స్కిప్పింగ్ ఆడుతున్న పిల్లలు మాత్రం మామూలుగా తాడుతో  ఎలా ఆడతారో ... పాముతో అంతకుమించి ఆడుతున్నారు. ఆ చిన్నారుల్లో  కాస్తయినా భయం కనిపించడం లేదు. అయితే అసలు విషయం ఏంటంటే ఆ పాము బ్రతికి  లేదు. అందుకే ఆ పిల్లలు కాస్తయినా భయం లేకుండా ఆ పాముతో తాడు ఆట ఆడుతున్నారు అని పక్కనే ఉన్న మహిళ తెలిపింది . పాము బతికున్న చచ్చిపోయిన పాము తో ఆట ఆడటం ఏంటి అని పలువురు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: