ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే ఆ పార్టీకి నలుగురు రాజ్యసభ ఎంపీలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు... అసలు వీళ్ళు ఎందుకు మారారు అనేది ఎవరికి అర్ధం కాలేదు. వారు ఉండటం వలన టీడీపీ కి బలం లేదు వెళ్లిపోవడం వలన బలహీన పడటమూ లేదు. మరి ఎందుకు మారారు ? టీజీ, గరికపాటి ఏమో గాని సుజనా, సీఎం రమేష్ మారడం వెనుక అయితే చంద్రబాబు హస్తం ఉందనే ప్రచారం ఎక్కువగా జరిగింది. రాజకీయంగా ఈ పరిణామం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

 

అందరి సంగతి పక్కన పెట్టి సుజనా విషయం మాట్లాడితే... ఆయన వ్యక్తిగత కారణాల కంటే చంద్రబాబు కోసమే బిజెపిలోకి వెళ్లారు అని అప్పుడే పరిశీలకులు అన్నారు. వాస్తవానికి చంద్రబాబుకి ఇప్పుడు కేంద్రంతో పని ఉంది. రాష్ట్రంలో బలమైన జగన్ ని ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు కేంద్రం మద్దతు చాలా అవసరం. కాబట్టి అక్కడికి వెళ్లిన సుజనా ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వానికి గోతులు తవ్వడం మొదలు పెట్టారు.

 

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బిజెపి నేతల ఇళ్లకు ఎక్కువ వెళ్లే సుజనా ఇప్పుడు ఆ పరిచయాల ద్వారా వైసీపీని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న దానికి, ఈయన చంద్రబాబు అనుకూల మీడియాకు ఇస్తున్న సమాచారాన్ని చాలా తేడా ఉంది. ఉరిమి కంగారు పడినా ఊరు కొట్టుకుపోయింది అంటూ ఆంధ్రప్రదేశ్ కి సమాచారం పంపుతున్నారు. తాజాగా సుజనా చౌదరి... మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

 

ఈ ప్రచారం కాస్త చికాకుగా మారింది. వైసీపీ ఎంపీలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంటూ చంద్రబాబు అనుకూల మీడియాకు పదే పదే సమాచారం ఇస్తున్న ఆయన తాజాగా ఆ వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మోడీని చంద్రబాబుకి దగ్గర చేయడానికి ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు సుజనా... ఇప్పుడు ఈ పరిణామాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం సుజనాను బాగానే వాడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: