జగన్ బెయిల్ రద్దు అవుతుంది... గత రెండు వారాల నుంచి తెలుగుదేశం పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఇది. కేంద్రం ఏదో చట్టం తీసుకొచ్చింది.. ఆ చట్టం ఆధారంగా బెయిల్ పై బయట తిరిగే వాళ్ళు అందరూ కూడా జైల్లోకి వెళ్లడం ఖాయం అనే ప్రచారం టీడీపీ ఎక్కువగా చేస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న కొన్ని పరిణామాల ఆధారంగా ఇప్పుడు ఈ ప్రచారానికి తెలుగుదేశం తెర లేపింది. చివ‌ర‌కు చంద్ర‌బాబు సైతం దీనిని బాగా ప్ర‌చారం చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు సూచిస్తున్న‌ట్టు టాక్‌..?

 

అధికారంలో లేనప్పుడే జగన్ జైలుకి వెళ్ళలేదు. ఇప్పుడు ఏ విధంగా వెళ్తారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే జగన్ బెయిల్ రద్దు అవడం అనేది జరిగే పని కాదు... రాష్ట్రంలో ప్రభుత్వంపై గాని జగన్ పై టీడీపీ చేస్తున్న స్థాయిలో వ్యతిరేకత లేదు. తనకు ఉన్న కార్పొరేట్ మిత్రులతో చంద్రబాబు ట్విట్టర్ లో చేస్తున్న ప్రచారం మినహా రాష్ట్రంలో అంత వ్యతిరేకత కూడా లేదు.

 

ఇక టీడీపీ కేంద్రానికి దగ్గర కావడానికి జగన్ ని దూరం చేస్తుందని అంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మోడీకి చంద్రబాబు గాలి తాకడం కూడా ఇష్టం లేదనే విషయం కొంత కాలంగా అర్ధమవుతుంది. సుజనా చౌదరి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ వచ్చే నష్టం లేదు. సుజనా రాయబారాన్ని మోడీ నమ్మేది లేదు. ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు అయితే బిజెపి నేతల మీద ఉన్న కేసులు చర్చకు వస్తాయి. యడ్యూరప్ప లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.

 

అవినీతి కేసులు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని బిజెపి మీదకు ఎదురు దాడికి వెళ్లే అవకాశం విపక్షాలకు ఇచ్చినట్టే. కాబట్టి బెయిల్ రద్దు అవడానికి వ్యక్తిగత హాజరుకి మినహాయింపు ఇవ్వకపోవడానికి ఏం సంబంధం లేదు. ఇదంతా ఒక బోగస్ ప్రచారం అనేది పలువురి మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: