నిన్న ఉదయం ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ భవనం లో భారీగా మంటలు ఎగసి పడడంతో ఏకంగా 43 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ భారీ అగ్ని ప్రమాదం పై దేశ ప్రధాని మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ తయారీ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్లాస్టిక్ బ్యాగుల కాలిపోయిన వాసనకు అక్కడ ఉన్నవారు ఊపిరాడక చనిపోయారు. అయితే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది చాలా మందిని  ప్రాణాలతో సురక్షితంగా కాపాడినప్పటికీ 43 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే భారీగా ఎగిసిపడ్డ మంటలను కంట్రోల్ చేసేందుకు ఫైర్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నించినప్పటికీ భారీగా ఎగిసిపడుతున్న మంటలను కంట్రోల్ చేసేందుకు చాలా సమయమే పట్టింది. 

 

 

 

 ఇదిలా ఉంటే నిన్న ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఓ కార్మికుడు చేసిన చివరి కాల్ అందరిని కంటతడి పెట్టిస్తుంది. తాను చనిపోయే ముందు తన అన్నకి ఫోన్ చేసి ముందుగానే తన మరణవార్త వినిపించి తన కుటుంబం గురించి ఆవేదన వ్యక్తం చేసిన తీరు అందరినీ కలిచి వేస్తోంది. కాగా  ఈ ఘోర అగ్నిప్రమాదంలో 43 మంది కార్మికులు మృతి చెందారు అయితే మృతుల్లో ఒకరైనా ఉత్తరప్రదేశ్ కు  చెందిన ఓ కార్మికుడు చనిపోయే ముందు తన సోదరి కి ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకొన్ని నిమిషాల్లో తాను చనిపోతున్నాను అంటూ సోదరుడికి ముందుగానే తన మరణ వార్త వినిపించాడు. కాగా  అతడు ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ కు చెందిన ముషారఫ్ అలీ  గా గుర్తించారు పోలీసులు. 

 

 

 

 అన్నయ్య నా చుట్టూ మంటలు దట్టంగా అలుముకున్నాయి.. తప్పించుకోవడానికి మార్గం కనిపించడం లేదు... మరి కాసేపట్లో నేను చనిపోతున్నాను... ఇంకో రెండు మూడు నిమిషాలు మాత్రమే నేను బతికి ఉండే అవకాశం ఉంది. ఈ మంటల్లో నుంచి తప్పించుకునే మార్గం దొరకడం లేదు దీంతో నేను బతికే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఆ దేవుడి దయ ఉంటే తప్ప నేను బతికి బయటపడటం సాధ్యం కాని పని.నా  కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నయ్య... రేపు వచ్చి నా మృత దేహాన్ని తీసుకెళ్ళు... నేను అగ్ని ప్రమాదంలో మరణించినట్లు ఇంట్లో పెద్దలకు కూడా చెప్పు అంటూ అతడు మాట్లాడిన ఆడియో సంభాషణ ప్రస్తుతం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఆడియో అందరిని కంటతడి పెట్టిస్తుంది. కాగా  ముషారఫ్ అలీ నాలుగేళ్లుగా ఈ ఫ్యాక్టరీ లో పనిచేస్తున్నారు. అతడికి భార్య ముగ్గురు అమ్మాయిలు ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: