కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి ప్రధాన కార్మిక సంఘాలు. ఈరోజు ఉదయం నుంచి భారత్ బంద్ ప్రారంభమైంది. అయితే ఈ బంద్ ప్రభావం ఎక్కువగా బ్యాంకింగ్ రవాణా రంగాలపై కనిపిస్తోంది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్ లోనే ఈ రోజు నుండి సమ్మె మొదలుపెట్టాలని ప్రధాన కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు,  పెరిగిన నిరుద్యోగం ఆర్థిక వృద్ధి మందగమనం తదితర అంశాలను వ్యతిరేకిస్తూ ఈ బంద్ కు  పిలుపునిచ్చాయి నేషనల్ ట్రేడ్ యూనియన్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ బంద్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో మొత్తం 25 కోట్ల మంది కార్మికులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం ప్రధాన కార్మిక  సంఘాలు పిలుపునిచ్చిన బండ్  పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ ప్రభావం భారీగానే కనిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా నేషనల్ ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చిన సమ్మె కొనసాగుతోంది. తెల్లవారుజాము నుండే రోడ్లపైకి వచ్చి సమ్మెను కొనసాగిస్తున్నారు కామ్రేడ్లు. ఇక బంద్ కు  మద్దతుగా కడపలో వామపక్షాలు ఆందోళన తెలుపుతున్నాయి. ఇక విజయవాడలో కూడా ఈ బంద్ ప్రభావం బాగానే కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో కూడా బస్సులను వామపక్ష నేతలు నిలిపి వేసినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ సహా కేరళ తదితర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం అధికంగా ఉంది. రిజర్వు బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలుపుతుండటంతో  ఈ బంద్ ప్రభావం మరింత పెరిగిపోయింది. 

 

 

 విద్యా సంస్థలను మూసి  వేయడంతో పాటు వాహనాల రాకపోకలను కూడా అడ్డుకుంటున్నారు కామ్రేడ్లు. ఇక కడపలో సమ్మెను కొనసాగిస్తున్న వామ పక్ష నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. కడపలో రైల్వే ట్రాక్ లపై ఆందోళనకు దిగిన  వామపక్షాలు...  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు  బెంగాల్లో కూడా వామపక్ష నేతలు నేషనల్ ట్రేడ్  యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నారు. అయితే సమ్మెలో పాల్గొంటే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఈ నిరసనలో పాల్గొనరాదని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలు యధావిధిగా సాగేలా చూడాలని ఆదేశించింది కేంద్రం. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తూ బందులో పాల్గొన్న వారిపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకోవడంతోపాటు వేతనాల్లో కోత తప్పదు అంటూ హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: