పురపాలక చిత్రం శర వేగంగా మారుతోంది. మేయర్లు,  డిప్యూటీ మేయర్లు , మున్సిపాలిటీలలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను ఎలాగైనా దక్కించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ  వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గంలో... ఇతర పార్టీల ఊహకందని విధంగా పావులు కదుపుతూ ముందుకు దూసుకుపోతున్నారు. బిజెపి ఎదురు దెబ్బకు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్పేట్ బడంగ్పేట్ కార్పొరేషన్లలో టిఆర్ఎస్ జెండా ఎగిరేలా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోని బాలాపూర్ లో మాజీ వైస్ చైర్మన్ చిగురంత నరసింహారెడ్డి తో సంప్రదింపులు జరిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 31 వార్డు నుంచి కార్పొరేటర్ గా  గెలిచిన ఆయన  భార్య పారిజాత రెడ్డికి మేయర్ పదవి ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

 

 

 ఈ విషయంలో రంగంలోకి దిగిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి ఆమెకు మేయర్ పదవి ఇవ్వడానికి ఒప్పించారు. దీంతో ఎంతో మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు  సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఆదివారం గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక బడంపేట్ లో టిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం గా మారింది. ఇకపోతే కాంగ్రెస్ బిజెపి పొత్తుతో మేయర్ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన సంఖ్యాబలం లేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ఈ క్రమంలోనే ఓ స్వతంత్ర అభ్యర్థి అయిన ఇబ్రహీం శేఖర్ తన మద్దతు కావాలంటే  డిప్యూటీ మేయర్ పదవి కావాలంటూ షరతు పెట్టారు దీనికి సబితా ఇంద్రారెడ్డి సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బిజెపీ కూటమికి మేయర్ పదవి  దక్కకుండా చేసేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శరవేగంగా రాజకీయ సమీకరణాలను చేస్తున్నారు.

 

 

 కాగా ఏ పార్టీకి సరైన మెజారిటీ రాక హంగ్  వచ్చిన మరో కార్పొరేషన్ మీర్పేట్. ఇక్కడ కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయ చతురతను ప్రదర్శించారు. 19 స్థానాలను గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ కు ఐదు స్థాన ల దూరం లో టిఆర్ఎస్ ఆగిపోగా... 7 గురు  స్వతంత్ర అభ్యర్థులు శరవేగంగా పార్టీలోకి చేరుతున్నారు మంత్రి . టిఆర్ఎస్ బలం మ్యాజిక్ ఫిగర్  దాటిపోయి మీర్పేట్ లో కూడా గులాబీ జెండా ఎగిరింది. అప్పటికి స్వతంత్రులు టిఆర్ఎస్ గూటికి చేరడంతో బిజెపికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఇక బోడుప్పల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్య మేయర్ పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి తమ వైపు కొంతమందిని లాక్కొని మేయర్ పీఠాన్ని అధిరోహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టిఆర్ఎస్ మొత్తం తమకున్న 14 సంఖ్యా బలం కి మరికొంతమంది ఇండిపెండెంట్ చేర్చుకుని  మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రస్తుతం జోరుగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీలు వేరువేరుగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: