మనం ఏ ప్రాంతానికైనా విహారయాత్రకు వెళ్లేటపుడు ఆ ప్రాంతం యొక్క పద్దతులు తెలుసుకొని వెళ్లాలి, లేదంటే లేనిపోని తలనొప్పులు వస్తాయి. ఒక్కోసారి అక్కడ ఉన్న కండిషన్స్‌కు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే పరిస్థితి సీరియస్‌గా మారే అవకాశం కూడా ఉంది. అలాంటి పరిస్థితే ఓ బ్రిటీష్‌ నటికి ఎదురైంది. ఓ బీచ్‌లో బికినీ వేసుకున్నందుకు ఆ బ్రిటీష్‌ నటిని పోలీసులు పట్టుకున్నారు. అంతేకాదు ఆమె చాలా దారుణంగా ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

ఇటీవల మాల్దీవులు పర్యటనకు వచ్చిన ఓ నటికి షాక్‌ ఇచ్చారు పోలీసులు. బికినీ వేసుకున్నందుకు ఆమెకు సంకెళ్లు వేయడానికి పోలీసులు ప్రయత్నించటంతో అక్కడ భయానక పరిస్థితులు కనిపించాయి. పోలీసుల తీరుతో భయపడిపోయిన నటి తన మీద రేప్‌ అంటెప్ట్ జరగుతుంది అంటూ కేకలు పెట్టింది. అయితే ఈ పని చేస్తోంది పోలీసులు కావటంతో ఎవరు వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే కెసీలియా జస్ట్రెంబ్స్‌కా అనే బ్రిటీష్‌ యువతి మఫూసిలోని బీచ్‌లో బికినీ ధరించి సముద్రం ఒడ్డున ఎంజాయ్ చేస్తుంది. ఆమెను గమనించిన ముగ్గురు పోలీసులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి ఆమె శరీరాన్ని క్లాత్‌తో కప్పే ప్రయత్నం చేశారు. అయితే అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో వాళ్లు తనను ఏదో చేయబోతున్నారన్న అనుమానంతో యువతి అక్కడి నుంచి పారిపోబోయింది. దీంతో పోలీసులు ఆమెను గట్టిగా పట్టుకొని బేడీలు వేసేందుకు ప్రయత్నించారు.

 

ఈ భయానక సంఘటనపై నటి స్పందిస్తూ తనను ఈ ఘటన ఎంతో వేదనకు గురి చేసిందని చెప్పింది. వాళ్లు నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారేమో అనుకున్నా. ఆ పెనుగులాటలో నాకు శ్వాస ఆగిపోయినంత పనైంది. నేను ప్రాణాలు పోయినట్టుగా అనిపించింది అని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై ఉన్నతాధికారులు స్పందించారు. అయితే ఆ బీచ్‌లో బికినీలతో సంచరించటం నిషేదం కావటంతో పోలీసులు అలా ప్రవర్తించారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: