చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ అక్కడ రెండు వేల మందికి పైగా బలిగొని ఇతర దేశాలకు కూడా వ్యాపించేసింది. ఇప్పుడు భారత్‌ కు కూడా వ్యాపించింది. ఇక్కడి ప్రజలను హడలెత్తించేస్తోంది. దాంతో 

కొందరు సినీ ప్రముఖులు కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. అనే విషయాన్ని తమకు తోచిన టిప్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

 

 

ప్రకాష్ రాజ్: నిమ్మకాయ రసంతో తాగితే వైరస్ దరిదాపుల్లోకి రాదట.

కాస్త వేడి నీళ్లలో నిమ్మకాయ రసం పిండుకుని తాగితే కరోనా వైరస్ మన దగ్గరికే రాదట. ఈ విషయాన్ని చైనాకు చెందిన బీజింగ్ మిలిటరీ హాస్పిటల్ సీఈఓ చెన్ హోరిన్ చెప్తున్నారు. ఈ వ్యాధిని నివారించేందుకు ప్రస్తుతం మందు లేదు కానీ విటమిన్ సీతో ఈ వైరస్‌ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

 

 

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తనకు తోచిన సలహా ఇచ్చారు. ఆమిర్‌కి చైనా, జపాన్‌లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి ప్రజలు కరోనాతో చనిపోతున్నారని తెలిసి వారి కోసం ఓ వీడియోను రిలీజ్ చేసారు. కరోనా వల్ల ఎంత మంది చనిపోతున్నారో నాకు తెలుసు. డాక్టర్లు, ప్రభుత్వాలు కూడా ఈ వ్యాధి నుంచి ప్రజలను కాపాడటానికి తమ ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మనం డాక్టర్లు చెప్పింది విని నడుచుకోవడం తప్ప ఏమీ చేయలేం. అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

 

 

ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ టిప్ షేర్ చేసారు. మనం ఎవరినైనా పలకరించేటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ ఇవ్వడం లాంటివి చేస్తుంటాం. కానీ కరోనా అంటురోగం కావడంతో షేక్ హ్యాండ్స్‌కి గుడ్ బై చెప్పి భారతీయ సంప్రదాయం ప్రకారం రెండు చేతులు జోడించి నమస్తే చెప్పాలని దీని ద్వారా ఇతరుల చేతులకు ఉన్న వైరస్ మనకు అంటుకోందని అనుపమ్ అన్నారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా ఓ టిప్ చెప్పారు. ఆయన ఎయిర్‌పోర్ట్‌కి చేతికి గ్లౌజులు వేసుకుని వచ్చారు. ఎటూ హృతిక్‌ని చూడగానే చాలా మంది షేక్‌హ్యాండ్ ఇవ్వాలని అడుగుతుంటారు. నో చెప్పి వారిని నొప్పించే బదులు సింపుల్‌గా ఇలా గ్లౌజులు వేసుకుంటే ఏ బాధా ఉండదు అని చెప్పకనే చెప్పారు.

 

 

ప్రముఖ యాంకర్ సుమ కూడా కరోనా వైరస్ గురించి మాట్లాడారు. కరోనా వైరస్ గురించి భయపాడాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. అలాగే ఆ వైరస్ సోకినప్పుడు మనకు కనిపించే లక్షణాలను కూడా చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. మనం మరుగున పడేసిన మన సంస్కృతి, సంప్రదాయ పద్ధతులను మళ్లీ కచ్చితంగా పాటిస్తే ఈ వైరస్ సోకకుండా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ‘ఈ వైరస్‌కు ఉన్న లక్షణాలు ముక్కుకారడం, తుమ్ములు, జ్వరం, గొంతునొప్పి, చాతిలో నొప్పి, చలి, గుండె వేగంగా కొట్టుకోవడం, రెండు మూడు రోజుల తర్వాత పొడిదగ్గు, స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరోచనాలు. ఇవి ఉంటే కచ్చితంగా వైరస్ సోకిందని కాదు. ఒక వేళ ఈ లక్షణాలు ఉంటే వెళ్లి డాక్టర్‌ను సంప్రదించండి. భయపడాల్సింది ఏమీ లేదని సుమ వీడియోలో వెల్లడించారు.

 

 

ఎప్పుడూ ఫ్యాన్స్‌ ని ఆప్యాయంగా పలకరించే బాలీవుడ్ హాట్ భామ సన్నీలియోన్ ఇటీవల వారిని దూరం పెడుతున్నట్లు ప్రవర్తించారు. ఇందుకు కారణం ప్రపంచాన్ని హడలుకొడుతున్న కరోనా వైరసే. సన్నీ ఫ్యాన్స్ సెల్ఫీ కావాలని అడిగినప్పుడు కాస్త వెనుకడుగు వేశారు. అయినా కూడా ఓ యువతి సెల్ఫీ కోసం సన్నీ వద్దకు వెళ్లగానే సన్నీ వెంటనే తన వద్ద ఉన్న మాస్క్‌తో ముక్కు, నోరు మూసేసుకున్నారు. దాంతో పక్కనే ఉన్న మరో మహిళ కోపంతో సెల్ఫీ దిగకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత సన్నీ దీనిపై స్పందిస్తూ.. ఎవరో ఏదో అనుకుంటారని మనం మన లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకోకూడదని అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: