పచ్చమీడియా ఎండి వేమూరి రాధాకృష్ణపై చట్ట పరమైన చర్యలు తప్పవా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తమ పార్టీ రాజ్యసభ ఎంపి జీవీఎల్ నరసింహారావు పై బురద చల్లే విధంగా కథనాలు అచ్చేస్తున్నారంటూ సీరియస్ వార్నింగ్  ఇవ్వటం సంచలనంగా మారింది. ఉద్దేశ్యపూర్వకంగా బురద చల్లుడు కార్యక్రమం ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ నేరుగా మీడియా పేరు పెట్టి పార్టీ ఇన్చార్జి సునీల్ ధియోధర్  వార్నింగ్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే మూడు రాజధానుల విషయంలో బిజెపి నేతల్లో స్పష్టమైన చీలిక వచ్చేసిన విషయం అందరీకీ తెలిసిందే. సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు రాజధాని అమరావతికి మద్దతుగా చంద్రబాబునాయుడు వాయిస్ ను వినిపిస్తున్నారు. అదే సమయంలో జీవిఎల్ నరసింహారావు మాత్రం కేంద్రప్రభుత్వ వైఖరిని వినిపిస్తున్నాడు.  

 

ఈ నేపధ్యంలోనే జీవిఎల్ పై పచ్చమీడియా కత్తి కట్టింది. పార్టీ లైన్ దాటి వైసిపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న జీవిఎల్ పై రాష్ట్ర నేతలు అధ్యక్షుడు జేపి నడ్డాకు ఫిర్యాదు చేసినట్లు, నడ్డా పిలిచి జీవిఎల్ పై మండిపడినట్లు కథనాలు అచ్చేసింది. ఇదే విషయమై సునీల్ ట్విట్టర్లో స్పందించారు. జీవిఎల్ పై నడ్డా మండిపడినట్లు అసత్య కథనాలు అచ్చేయటమే కాకుండా ఉద్దేశ్యపూర్వకంగా బురద చల్లుతున్నట్లు సునీల్ మండిపడ్డాడు.

జీవిఎల్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు ఏబిఎన్ చానల్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేయటం గమనార్హం. పత్రికా మీడియా విలువలను మరచిపోయి అసత్య కథనాలు ప్రసారం చేస్తు జనాలను తప్పుడు దోవ పట్టిస్తున్నట్లు విరుచుకుపడ్డాడు. ఏబిన్, ఆంధ్రజ్యోతి తన వైఖరి మార్చుకోకపోతే ఛానల్ చర్యలను బహిష్కరించటమే కాకుండా చట్టపరమైన  చర్యలు కూడా తీసుకుంటామంటూ సునీల్ చేసిన హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. అయినా బురద చల్లే కథనాలు అచ్చేయటం, ప్రసారం చేయటం పచ్చమీడియాకు కొత్తేమీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన తొమ్మిది నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న పని అదే కదా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: