ఏపీలో బీసీల కేంద్రంగా రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. తాజాగా, వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తాడేపల్లిలోని  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపై ఘాటు విమ‌ర్శించారు. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్న చంద్ర‌బాబు 2018లో స్థానిక ఎన్నికలు రావాల్సి ఉన్నా ఎందుకు నిర్వహించలేదని ప్ర‌శ్నించారు. ఆనాడు బీసీలపై చంద్రబాబు ప్రేమ ఏమైందని ప్ర‌శ్నించారు. ``నిజంగా చంద్రబాబుకు బిసిలపై ప్రేమ వుంటే..యాబై తొమ్మిది శాతం రిజర్వేషన్‌తో ఎన్నికలు జరిపి ఉండేవారు. ఏపి బిసి  ఫైనాన్స్ కోఆపరేటీవ్ కార్పోరేషన్ ద్వారా వచ్చిన లెక్కలే బిసి రిజర్వేషన్లకు ఆధారం.  ఇది తెలిసినా కూడా చంద్రబాబు సీఎంగా వుండి తన హయాంలో ఎందుకు ఆ సర్వే చేయలేదు? ఈ రాష్ట్ర జనాభాలో బిసిల సంఖ్య ఎంత అని ఎకనమిక్ సర్వే చేయించాలని చట్టాలు చెబుతున్నాయి. దీనిపై చంద్రబాబు సీఎంగా వుండి ఎందుకు చొరవ తీసుకోలేదు?చంద్రబాబు నిర్వాకం వల్ల బిసిలు న్యాయంగా తమకు దక్కాల్సిన రిజర్వేషన్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బిసిలు రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు సర్వే చేయలేదు. చంద్రబాబు వల్ల బిసిలకు జరిగిన మేలు పై బహిరంగ చర్చకు రావాలి.`` అని బ‌హిరంగ స‌వాల్ విసిరారు.చంద్రబాబు, ఆయన తాబేదారు యనమల అయినా సరే చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాం అంటూ పార్థసార‌థి స్ప‌ష్టం చేశారు.  

 

 


చంద్రబాబు బిసి ద్రోహి అని పార్థసార‌థి మండిప‌డ్డారు. ``బలహీన వర్గాలకు మేలు జరిగిందంటే... అది గతంలో వైఎస్ఆర్ హయాం, ఇప్పుడు జగన్ గారి హయాంలోనే జరిగింది. టిడిపి బిసిలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంది. ఆదరణ పథకం, అరకొర సబ్సిడీల వల్ల బిసిల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు. బిసిలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఏనాడు అనుకోలేదు. చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు ఎక్కువ రిజర్వేషన్లు దక్కడాన్ని కూడా చంద్రబాబు సహించలేక పోతున్నాడు. అందుకే తన అనుయాయుడితో సుప్రీంకోర్ట్ లో కేసులు వేయించారు. చంద్రబాబు తన అనుచరుడు బిర్రు ప్రతాపరెడ్డిని ఉసిగొల్పి కేసులు వేయించిన విషయం వాస్తవం కాదా? చంద్రబాబు తన ప్రభుత్వంలో బిర్రు ప్రతాపరెడ్డికి పదవి ఇచ్చిన విషయం వాస్తవం కాదా? టిడిపిలో పదవులు పొందిన బిర్రు ప్రతాపరెడ్డిని వైఎస్ఆర్ సిపి కి చెందిన వ్యక్తి అని ఎలా చెబుతున్నావు చంద్రబాబు? `` అని పార్థసార‌థి నిల‌దీశారు. 

 

 

స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా...రూ. నాలుగు వేల కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రాకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని పార్థ‌సార‌థి ఆరోపించారు. ``ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు దివాలా తీయించాడు. బలహీనవర్గాల పట్ల ప్రేమ వున్నట్లు చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడు. ఈ ఏడు మాసాల్లో సీఎంగా జగన్ వచ్చినప్పటి నుంచి ....ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా వున్న సమస్యలను పరిష్కరించారు. బిసి కమిషన్ కు చట్టబద్దత కల్పిoచిన ఘనత జగన్ గారికే దక్కుతుంది. బిసిలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌ది కరోనా వైరస్ లాగా బిసిలను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నించారు.`` అంటూ చంద్ర‌బాబు తీరును దుయ్య‌బ‌ట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: