గత కొన్ని రోజులుగా తెలంగాణలో  కరోనా వైరస్  కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా  వైరస్ సోకిందని అతనికి ఐసోలేషన్ వార్డుల్లో పెట్టి ప్రత్యేక వార్డుల్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ ప్రజలు అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ఇక కరోనా  ఎఫెక్ట్ తో  రాష్ట్రమంతా హడావుడి మొదలైపోయింది.. ఏం చేస్తే కరోనా  వస్తుందో అనే భయంతో చాలామంది భయపడిపోయారు. అయితే తెలంగాణలో కరోనా  వైరస్ సోకింది అనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ సోక లేదు అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

 

 

 నేడు అసెంబ్లీ సమావేశంలో భాగంగా మాట్లాడిన ముఖ్యమంత్రి  కేసీఆర్  ఈ విషయాన్నీ స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో కరోనా  వ్యాపిస్తే తమ శాయశక్తులా ఒడ్డి  మరి కరోనా  వైరస్ ను  ఎదుర్కొంటామని అసెంబ్లీ  వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాస్కుల  కొరత చాలా ఉంది అంటూ మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనసూయ వ్యాఖ్యలకు ఉద్దేశిస్తూ  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కరోనా వైరస్ సోకింది అంటే భయపడి పోవాల్సిన పని ఏమీ లేదని పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అంటూ ఇటీవలే ఓ సైంటిస్ట్ తనకు ఫోన్ చేసి చెప్పారు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

 

 

 అయితే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలోకి కరోనా  వైరస్ వచ్చినప్పటికీ కేవలం కరోనా  వైరస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు మాత్రమే ఉంటుందని... 20 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే నశించిపోతుంది అంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీల పైగానే ఉంది అంటూ తెలిపారు. అందుకే కరోనా  గురించి భయపడాల్సిన పని లేదు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కరోనా  లేదని స్పష్టం చేయడంతో తెలంగాణ ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొన్నటి వరకు ఎక్కడ కరోనా  వ్యాప్తి చెంది ప్రాణాలను హరించుకు పోతుందో  అని ప్రాణభయంతో వణికిపోయిన  వారందరూ ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: